Begin typing your search above and press return to search.

బాలయ్య మమ్మీకి ఫోటోషాప్ అవసరమా?

By:  Tupaki Desk   |   14 Oct 2017 9:39 AM GMT
బాలయ్య మమ్మీకి ఫోటోషాప్ అవసరమా?
X
బాలయ్య మమ్మీ అంటే ఇంకెవ్వరో కాదండోయ్.. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో తల్లి గౌతమీబాలాశ్రీ పాత్రను పోషించిన రిటైర్డ్ హీరోయిన్ హేమా మాలిని గురించి చెబుతున్నాం. ఈ అక్టోబర్ 16న ఆవిడ వయస్సు 69 సంవత్సరాలు అవ్వనుంది. ఆ సందర్భంగా తన జీవిత చరిత్రను ఒక రైటర్ తో కలసి ఒక పుస్తక రూపంలోకి తెచ్చి దానిని విడుదల చేయనుంది హేమా మాలిని. ఎలాగో ఆమె బిజెపి ఎంపి కూడా కాబట్టి.. ఆమె రాసిన పుస్తకానికి స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఒక ముందుమాటను రాస్తున్నారులే.

ఇకపోతే ఈ పుస్తకం పేరు ''బియాండ్ ది డ్రీమ్ గాళ్‌'' అని తెలియజేస్తూ.. ఈమె ఆ బుక్ కవర్ పేజీని రిలజీ్ చేసింది. కాని ఆ కవర్ పేజ్ చూస్తుంటే మాత్రం.. జనాలకు ఎందుకో కిక్ రావట్లేదని వారు నెట్టింట్లో చేస్తున్న కామెంట్లు చూస్తే అర్ధమవుతోంది. కాస్త సెమీ ట్రాన్సపెరెంట్ గా ఉన్న బట్టలను వేసుకుని హాట్ హీరోయిన్ లా రెడీ అయిన హేమా మాలిని.. ముఖానికి వేసుకున్న మేకప్ ఒకెత్తయితే.. దానిని కంప్యూటర్లో ఫోటోషాప్ సాయంతో అస్సలు ముడతలు లేని పాలచందమైన మోముగా గ్రాఫిక్ డిజైనర్లు తీర్చిదిద్దిన తీరు అమోఘం.

అయితే 69 ఏళ్ళ వయస్సులో ఉన్న ఒక సెలబ్రిటీ కమ్ రాజకీయ నాయకురాలు.. ఇంకా ఇలాంటి పాల మేకప్ మెరుగులతో ప్రజలను మభ్య పెట్టాల్సిన అవసరం ఉందంటారా? అంటున్నారు నెటిజన్లు. కవర్ పేజీ మీదనే రియాల్టీకి దగ్గరగా ఏమీ చెప్పలేకపోతే.. ఇక లోపల మాత్రం అంత రియల్ గా ఏం చెప్పుంటుంది అనేది న్యూ జనరేషన్ రీడర్ కు ఎవ్వరికైనా వచ్చే ధర్మ సందేహం. పుస్తకం రిలీజ్ కానివ్వండి.. అందులో ఏముందో ఎలా ఉందో నిజాలు చెప్పారో కప్పిపుచ్చారో తెలుస్తుంది. ముఖ్యంగా మొగుడు ధర్మేంద్రకు ఆల్రెడీ పెళ్ళయినా కూడా అతగాడ్ని రెండో పెళ్ళి ఎలా చేసుకుంది అనే విషయం ఏం చెబుతుందోనని అందరూ ఎదరు చూస్తున్నారు.