Begin typing your search above and press return to search.
హేమమాలిని తెలుగు సీక్రెట్ అదేనట
By: Tupaki Desk | 5 Sep 2016 7:30 AMబాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని చాలా కాలం తర్వాత తెలుగు సినిమా చేస్తున్నారు. 45 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు సినిమా చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్న ఆమె.. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ లో షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక్కడే తయారైన అనేక అందమైన చీరలు బోలెడన్ని హేమమాలిని సూట్ కేసుల్లోకి చేరుతున్నాయట. అవన్నీ తాను కొనలేదని.. అనేక మంది గిఫ్టులు ఇస్తున్నారన్న ఆమె.. తన బంధువులకు ఇచ్చేందుకు అనేక శారీస్ కొంటున్నట్లు చెబుతున్నారు.
అయితే.. 45 ఏళ్ల తర్వాత తెలుగులో నటించేందుకు మొదట సందేహించిందట ఈమె. 'నాకు తెలుగు రాదనే ఉద్దేశ్యంతో మొదట ఈ ఆఫర్ ని వద్దన్నాను. కానీ ఈ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. బాలకృష్ణ తల్లిగా మహారాణి రోల్ లో చేస్తున్నా. తెలుగు భాష నా మాతృభాష అయిన తమిళ్ కి దగ్గరగా ఉంటుంది. అందుకే తెలుగు డైలాగ్స్ ను తమిళ్ లోను.. కొన్నిసార్లు ఇంగ్లీష్ లో కూడా చెప్పేస్తున్నా' అని చెప్పింది బాలీవుడ్ మాజీ డ్రీమ్ గాళ్ హేమమాలిని.
17 ఏళ్ల వయసులో తన కెరీర్ ను తెలుగు సినిమాలో డ్యాన్స్ నెంబర్ తోనే ప్రారంభమైందన్న ఈమె.. ఆ తర్వాత ఏడేళ్లకు మరో తెలుగు సినిమాలో చేశానని చెప్పగా.. మరెప్పుడూ టాలీవుడ్ లో నటించే అవకాశం రాలేదని చెప్పింది. ఇప్పుడు మళ్లీ ఓ తెలుగు మూవీలో నటించడం హ్యాపీగా ఉందంటోంది మాజీ డ్రీమ్ గాళ్.