Begin typing your search above and press return to search.
హాలీవుడ్ అంటున్న అలనాటి డ్రీమ్ గాళ్
By: Tupaki Desk | 11 March 2016 5:30 AM GMTబాలీవుడ్ డ్రీమ్ గాళ్ ఎవరంటే.. లేటెస్ట్ భామలు ఎంతమంది ఉన్నా ముందుగా హేమా మాలిని గుర్తొచ్చేస్తుంది. అంతగా అనాటి కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ అందాల నటికి.. ఈ మధ్య సినిమాల స్పీడ్ బాగా తగ్గిపోయింది. ఓ ఐదేళ్ల క్రితం ఆరక్షణ్ లో గెస్ట్ రోల్ చేయగా.. ప్రస్తుతం షిమ్లా మిర్చిలో నటిస్తోంది. ప్రస్తుతం తన గాన మాధుర్యాన్ని వినిపిస్తూ పాటలు పాడేస్తున్న హేమ.. రీసెంగా గా 'డ్రీమ్ గాళ్' అనే ఆల్బమ్ ని కూడా రిలీజ్ చేసేసింది.
ఈ తరం సినిమాల్లో పాత జనరేషన్ నటీనటులకు అవకాశాలు ఉండడం లేదంటూ.. బాగా ఆవేదన పడుతున్న హేమ మాలిని.. హాలీవుడ్ లో అయితే మాత్రం సీనియర్ యాక్టర్లకు కూడా బోలెడన్ని అవకాశాలుంటాయని అంటోంది. ఇలాంటి కల్చర్ మన దగ్గర లేదని ఆరోపించింది కూడా. తనకు ఇంకా నటించాలని ఉన్నా.. పాతతరం నటులకు రోల్స్ ఇవ్వడంలో బాలీవుడ్ ఫెయిల్ అవుతోందని ఆవేశపడిపోయింది కూడా.
హేమ మాలిని చెప్పిన వెర్షన్ కరెక్టే కానీ.. హాలీవుడ్ లో సీనియర్లకి రోల్స్ అంటే.. వాళ్లు ఏ పాత్ర అయినా చేసేస్తారు. స్టోరీలో కీలకంగా ఉండాలి, ఎక్కువ సీన్స్ ఉండాలి, కంప్లీట్ మేకప్ తో కనిపించాలి లాంటి లిమిటేషన్స్ లేకుండా.. ఎలాంటి పాత్రల్లో అయినా నటిస్తారు హాలీవుడ్ నటులు. ఇక్కడ అలాంటి కల్చర్ లేదు కదా. సీనియర్ తారలను తీసుకుంటే.. వాళ్ల మీదే సీన్స్ ఎక్కువ ఉండాలనే పట్టు ఉంటుంది. అందుకే మూవీ మేకర్స్ కూడా వీళ్లని పట్టించుకోవడం లేదు. ఆ విషయం చెప్పకుండా ఇలా తప్పందా అవతలి వాళ్లదే అంటే ఎలా?