Begin typing your search above and press return to search.
దీపిక ఎంగేజ్మెంట్ కి హేమమాలిని విషెస్
By: Tupaki Desk | 28 April 2016 9:42 AM GMTఆన్ లైన్ మీడియా చాలా పవర్ ఫుల్. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను ఉపయోగించడంలో చాలా అలర్ట్ గా ఉండాలి. లేకపోతే బోలెడంత కన్ఫ్యూజన్, మరింత అపార్ధాలు దారి తీసేందుకు బోలెడు ఆస్కారం ఉంటుంది. ఇప్పుడా విషయం హేమమాలిని ట్వీట్ చేసిన ట్వీట్ తో మరోసారి నిరూపితమైంది.
'దీపికా, నీ ఎంగేజ్ మెంట్ సందర్భంగా శుభాకాంక్షలు, మీ ఇద్దరూ కలిసిన మంచి భవిష్యత్తు - సంతోషం - ఆనందం ఉండాలని కోరుకుంటున్నా..' ఇదీ సీనియర్ నటి హేమమాలిని చేసిన ట్వీట్. ఈ ఒక్క ట్వీట్ తో దీపికా పదుకొనే పెళ్లి ఫిక్స్ అయిపోయిందని, త్వరలో మ్యారేజ్ అనే వార్తలు గుప్పుమన్నాయి. దీపిక ప్రస్తుతం రణవీర్ సింగ్ తో రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ తో పాటు దేశమంతా దీపిక పెళ్లి గురించి మాట్లాడ్డం మొదలుపెట్టేసరికి.. అసలు తను చేసిన తప్పేంటో అప్పుడు అర్ధమైంది హేమమాలిని.
'లేదు లేదు - నేను విషెస్ చెప్పిన దీపిక.. నన్ను ట్విట్టర్ లో ఫాలో అవుతున్న అమ్మాయి. అంతే తప్ప పదుకొనే కాదు' అంటూ మరోసారి వివరణ ఇస్తూ ట్వీట్ చేయాల్సి వచ్చింది హేమమాలినికి. ఈ క్లారిటీ ఏదో ముందే ఉంటే చాలామందికి గందరగోళం లేకుండా ఉండేది. కానీ అప్పుడేమో అత్యుత్సాహంతో అభిమానికి ట్వీట్ చేయడంతో తర్వాత ఎక్స్ ప్లనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక.. సీనియర్ నటి హేమమాలిని బాలకృష్ణకు తల్లిగా 45 ఏళ్ల తర్వాత టాలీవుడ్ తెరపై గౌతమిపుత్ర శాతకర్ణిలో నటించనుంది.