Begin typing your search above and press return to search.
అంత మందిని సేవ్ చేసి తాను బుక్ అయ్యిందే!
By: Tupaki Desk | 24 July 2019 5:31 AM GMTట్విస్టులతో ఉండే బిగ్ బాస్ షోలో తాజాగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తొలి రోజునే నామినేట్ అంశాన్ని తెర మీదకు తీసుకురావటం ద్వారా బిగ్ బాస్ -3 హౌస్ లో హీట్ పెంచేశాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ మధ్య మనస్పర్థల్ని ఎలా తీసుకురావాలన్న విషయంలో బిగ్ బాస్ టాలెంటే వేరు. ఆ విషయం కళ్లకు కట్టేలా తాజా సీజన్ లో అర్థమయ్యేలా చేస్తున్నారు బిగ్ బాస్.
హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే సర్దుకోవటానికి ఛాన్స్ ఇవ్వకుండా.. షో మీద ఆసక్తిని అంతకంతకూ పెంచేందుకు వీలుగా నామినేట్ కార్యక్రమాన్ని తెరమీదకు తేవటం.. కొందరు కంటెస్టెంట్లను వారికి బదులుగా వేరే వారిని రీప్లేస్ చేసే ఆటను మొదలు పెట్టటం ఒక ఎత్తు అయితే.. ఆ వ్యవహారంలో పెద్దమనిషి పాత్ర పోషించాలంటూ హేమను ఫుల్ యాక్టివ్ చేసిన బిగ్ బాస్.. ఊహించని ఫిట్టింగ్ తో షాకిచ్చారు.
తమ మీద పడిన నామినేట్ డేంజర్ నుంచి బయటపడేందుకు ఐదుగురు కంటెస్టెంట్లు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేశారు. ఇందులోకొందరు సక్సెస్ అయితే.. మరికొందరు ఫెయిల్ అయ్యారు. షోలో తొలి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ తనకు బదులుగా తీన్మార్ సావిత్రిని నామినేట్ చేస్తున్నట్లు చెప్పినా.. చివరకు రాహుల్ నే నామినేట్ చేశారు జడ్జిగా వ్యవహరించిన హేమ. వరుణ్ వాదనకు ఓకే చెప్పిన హేమ.. ఆయన చెప్పిన పునర్నవిని నామినేట్ చేశారు. వితికా షెరూ తనకు బదులు అషూ రెడ్డిని రీప్లేస్ చేసే ప్రయత్నాన్ని హేమ నో చెప్పేశారు. శ్రీముఖి తనకు బదులుగా హిమజను రీప్లేస్ చేయాలని చెప్పగా ఆమె మాటకు హేమ ఓకే చెబితూ హిమను నామినేట్ చేశారు. జాఫర్ తనకు బదులుగా మహేశ్ విట్టాను రీప్లేస్ చేయాలని చెప్పినా.. అతడు వినిపించిన వాదనకు హేమ నో చెప్పటంతో జాఫర్ నామినేట్ చేశారు.
మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లలో ఐదుసార్లు బెల్ మోగుతుందని చెప్పిన బిగ్ బాస్.. మరి ఆరో నామినేట్ పర్సన్ గా నిలిచిన బాబా భాస్కర్ విషయంలో కొత్తతరహా మెలిక పెట్టారు. బాబా భాస్కర్ తో పాటు అప్పటివరకూ జడ్జి పాత్ర పోషించిన హేమలో ఎవరో ఒకరిని నామినేట్ చేయాలని.. ఇంటి సభ్యులంతా ఈ నిర్ణయంలో ఏకాభిప్రాయంతో ఉండాలని చెప్పటంతో.. అందరూ చర్చించుకొని బాబా భాస్కర్ ను సేవ్ చేసి హేమను నామినేట్ చేశారు.
అప్పటివరకూ న్యాయంగా.. ధర్మంగా.. తన ఆత్మ ప్రభోధం ప్రకారం జడ్జి పాత్ర పోషించిన హేమ చివరకు నామినేట్ కావటం ఈ ఎపిసోడ్ లో ట్విస్ట్ గా చెప్పాలి. తాజాగా షో జరుగుతున్న తీరు చూస్తే. మొత్తం మీదా తొలి వారంలోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యేలా ఉన్నట్లు కనిపిస్తోంది.