Begin typing your search above and press return to search.
పూరీ..కృష్ణవంశీ..సుబ్బరాజు..ఎందరికో వండిపెట్టారట
By: Tupaki Desk | 26 Jun 2016 5:30 PM GMTతెర మీద కనిపించే పాత్రలకు.. తెర వెనుక ఉండేదానికి మధ్య అంతరం ఎంతన్నది క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. జోవియల్ గా ఉన్నట్లు కనిపించే ఆమె చాలా కాలిక్యులేటెడ్. చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ఆమె.. ఎంతోమంది స్టార్ డైరెక్టర్లకు పెద్ద దిక్కు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతదాకా ఎందుకు తెలుగులో ప్రముఖ దర్శకులు అన్న ట్యాగ్ ఉన్న పూరీ జగన్నాద్ కానీ.. కృష్ణవంశీ కానీ మరికొందరితో పాటు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు అయిన సుబ్బరాజు.. కృష్ణుడు లాంటి వారితో ఆమెకున్న అనుబంధం వింటే.. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వారు కూడా ఉంటారా? అనిపించక మానదు. ఆ విషయాల్ని హేమ మాటల్లోనే వింటే మరింత బాగుంటుంది.
= జాన్ కెమేరామన్ కావటంతో చాలామంది ఇంటికి వచ్చి వెళుతుంటారు. జగనన్న.. అదే పూరీ జగన్నాథ్.. కృష్ణవంశీ.. సుబ్బరాజు.. కృష్ణుడు.. ఇలా అంతా నా చేతివంట తినేవాళ్లే. జగనన్న మా ఇంటి కిందనే ఉండేవాడు.
= మా ఆయన దగ్గర కొట్టేసిన డబ్బులు వాడికి ఇచ్చేదాన్ని. వాడిది లవ్ మ్యారేజ్. నేను.. నా భర్త పెళ్లి పీటల మీద కూర్చొని వాడి పెళ్లి చేశాం. చాలా రోజులన్నీ సందడిగా గడిచేవి. ఒకప్పుడు అసిస్టెంట్ గా తెలిసిన వారంతా ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు అయ్యారు.
= ఇంట్లో కొంతకాలం ఉన్నాక.. మళ్లీ సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా. కృష్ణవంశీ.. త్రివిక్రమ్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ.. జగనన్న మాత్రం అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదు.
= ఎందుకంటారా? పూరీ సినిమాల్ని జాగ్రత్తగా గమనిస్తే.. వాడి సినిమాల్లో ఆడ క్యారెక్టర్లు రెండే ఉంటాయి. ఒకటి హీరో వాళ్ల అమ్మ. రెండోది హీరోయిన్. నేను హీరోయిన్ గా వేయలేను కదా. ఇక.. హీరో అమ్మ పాత్రకు వస్తే.. నువ్వు అమ్మేంటి? అని అంటాడు.
= కాస్త డిఫరెంట్ పాత్రలు వేయాలని సుకుమార్ తీసిన కుమారి 21ఎఫ్ లో హీరో అమ్మ క్యారెక్టర్ కావాలనే చేశా. ఆ సినిమాకు ముందు సుకుమార్ నన్ను చూసి.. తల్లి పాత్రలకు సూట్ కావు. ఈ సినిమాలో అన్ని ఏడుసు సీన్నే అన్నారు. కెమెరా మన్ కూడా సూట్ కాదన్నారు. కానీ.. తర్వాత వారి అభిప్రాయాన్ని మార్చుకున్నారు.
= సినిమా ఇండస్ట్రీలో చాలామందిని నేనొక అక్క.. వదినను. ఎవరికన్నా ఇబ్బంది కలిగితే.. హేమక్క ఇంటికి వెళితే ఒక పూట భోజనం పెడుతుందని ఫీల్ అవుతారు. న్యాయం ఉంటే సపోర్ట్ చేస్తుందని చెబుతారు. నా వరకూ నేను తృప్తిగా బతుకుతున్నా. పవర్ ఫుల్ పోలీస్ పాత్ర.. లేడీ డాన్ పాత్రలు చేయాలని ఉంది.
= సినిమా అనేది ఓ పిచ్చి. ఒక్కసారి ఆ పురుగు కుట్టిందంటే.. తినడానికి తిండి లేకపోయినా ఇక్కడే ఉంటారు.
= నాగార్జునగారంటే ఇష్టం. వెయ్యి మందిలో ఉన్నా నన్ను గుర్తించిఅప్యాయంగా పలుకరిస్తారు. ఆయన బిజినెస్ మెన్ కావొచ్చు. కానీ.. కమర్షియాలిటీ కనిపించదు. బన్నీ ఎనర్జీఅంటే ఇష్టం. రబ్బర్ మనిషిలా డ్యాన్స్ లు చేస్తాడు. అతడ్ని చూస్తే జెలసీగా ఉంటుంది. ఎన్టీఆర్ రోబో లాంటోడు. పేజీ డైలాగ్ అయినా రోబోలా స్కాన్ చేసి సింగిల్ టేక్ లో ఓకే చేయిస్తాడు.