Begin typing your search above and press return to search.

టాప్ ప్రొడక్షన్ అకౌంట్ హ్యాక్ చేసారు!

By:  Tupaki Desk   |   12 Nov 2018 11:11 AM GMT
టాప్ ప్రొడక్షన్ అకౌంట్ హ్యాక్ చేసారు!
X
టెక్నాలజీ ఎంత పెరిగినా దానికి సంబంధించిన లొసుగులు కూడా అదే నిష్పత్తిలో అంతకంతా వస్తూనే ఉంటాయి. అందులో ముఖ్యమైనది హ్యాకింగ్. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత సినిమా కంపెనీలు మొదలుకుని హీరోలు కమెడియన్ల దాకా అందరు అందులో యాక్టివ్ గా ఉండటం నిత్యకృత్యంగా మార్చుకున్నారు. అసలు వీటి జోలికి పోకూడదు అని కంకణం కట్టుకున్న యాక్టర్స్ కూడా నకిలీల బెడద తట్టుకోలేక పిఆర్ ల సహాయంతో స్వంతంగా అకౌంట్లు నడిపిస్తున్న వాళ్ళు లేకపోలేదు. కాకపోతే హ్యాకింగ్ బెడద మాత్రం ఎవరికైనా తప్పదు.

తాజాగా ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ వీటి బారిన పడింది. తమిళ్ ముఖ్య బాషగా సౌత్ లో వందకు పైగా సినిమాలు తీసి టాప్ ప్రొడక్షన్ హౌస్ గా చెలామణిలో ఉన్న శ్రీ తేనాండ్రాల్ ఫిలిమ్స్ కు సంబందించిన ట్విట్టర్ హ్యాండిల్ లో ఎవరో హ్యాక్ చేసారు. సంబంధం లేని పోస్టులు ట్వీట్లు పెడుతూ అభిమానులను అయోమయానికి గురి చేయడం మొదలుపెట్టారు. ఇది కాస్తా రచ్చ కావడంతో వెంటనే రంగంలోకి దిగిన సదరు టీమ్ రిపేర్ చేసే పనిని మొదలుపెట్టింది. ఈ బ్యానర్ అధినేతల్లో ఒకరైన హేమ రుక్మిణి క్లారిటీ ఇస్తూ ఫ్యాన్స్ ఇందులో వచ్చే ట్వీట్లకు ఖంగారు పడకండని అవేవి తాము అధికారికంగా పోస్ట్ చేసేవి కాదని క్లారిటీ ఇచ్చారు.

ఈ సంస్థ నిర్మించిన వందో సినిమా విజయ్ నటించిన మెర్సల్. ఇది తెలుగులో అదిరింది పేరుతో డబ్ అయ్యింది. వంద కోట్లకు వసూళ్లతో రికార్డు సృష్టించిన ఆ మూవీ తర్వాత వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టిన ఈ బ్యానర్ లో కాంబోల గురించి హీరోలు చేయడం గురించి రకరకాల పుకార్లు ప్రచారం కావడం దానికి ట్విట్టర్ ని వేదికగా మార్చుకోవడంతో ఇది కాస్త వివాదంగా మారింది. అయినా అంత పెద్ద నిర్మాణ సంస్థ ట్విట్టర్ కే ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాలా