Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 6 లీక్ : ఈ వారం నామినేషన్ లో ఉండే 9 మంది వీళ్లే

By:  Tupaki Desk   |   19 Sep 2022 6:35 AM GMT
బిగ్ బాస్ 6 లీక్ : ఈ వారం నామినేషన్ లో ఉండే 9 మంది వీళ్లే
X
తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 6 రెండు వారాలు పూర్తి చేసుకుని మూడవ వారంలో అడుగు పెట్టింది. మొదటి వారంలో ఎలిమినేషన్ ఏమీ లేదు. కానీ రెండో వారంలో అంతా ఊహించినట్లుగానే ఇద్దరు కంటెస్టెంట్స్ ను బయటకు పంపించారు. అనూహ్యంగా అభినయ శ్రీ బయటకు వెళ్లడం కొందరికి ఆశ్చర్యంగా అనిపించింది. ఆమె ఇంకొన్ని రోజులు ఉండాల్సిన అమ్మాయి అనేది కొందరి అభిప్రాయం.

ఆ విషయం పక్కన పెడితే నేటి ఎపిసోడ్‌ లో ఎలిమినేషన్ కి నామినేషన్ ప్రక్రియ జరిగింది. ప్రతి సోమవారం మాదిరిగానే ఈ వారం కూడా రచ్చ రచ్చ అన్నట్లుగానే ఎలిమినేసన్ నామినేషన్ పక్రియ జరిగింది. మొహానికి రంగు పూసి మరీ నామినేట్‌ చేసే పక్రియను బిగ్‌ బాస్ కంటెస్టెంట్స్ కి ఇవ్వడం జరిగింది. ఒకొక్కరు ఇద్దరు చొప్పున నామినేట్‌ చేయాల్సి ఉంటుంది.

ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా లీక్‌ వచ్చింది. ఈ వారం ఏకంగా 9 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కి నామినేట్‌ అయ్యారు. ఆ 9 మంది ఎవరంటే.. చలాకీ చంటి.. బాలాదిత్య.. సింగర్ రేవంత్‌.. గీతూ రాయల్‌.. అరోహి రావ్‌.. నేహా చౌదరి.. శ్రీహాన్.. ఇనాయా సుల్తానా.. వాసంతి కృష్ణన్‌.

ఈ 9 మందిలో ఈ వీకెండ్‌ లో ఎవరు ఎలిమినేట్‌ అవుతారు అనేది ఉత్కంఠ భరితంగా మారింది. వరుసగా మూడు వారాలుగా ఈ 9 మందిలో కొందరు ఎలిమినేషన్ కి నామినేట్‌ అవుతూ వస్తున్నారు. గత వారం నామినేట్ అయిన సింగర్ రేవంత్‌ కి అనూహ్యంగా మెజార్టీ ఓట్లు పడ్డాయట.

పోల్ అయిన ఓట్లలో దాదాపుగా 50 శాతం ఓట్లు ఆయనకే వచ్చాయి అనేది బిగ్ బాస్ వర్గాల టాక్. కనుక ఈ వారం కూడా రేవంత్ సేఫ్‌ అవ్వడం కన్ఫర్మ్‌. ఈ 9 మందిలో అరోహి రావ్‌... వాసంతి కృష్ణన్‌.. ఇనాయా సుల్తానా లు డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ ముగ్గురిలో ఎవరైనా ఔట్‌ అవ్వచ్చు.. వారి సీన్‌ రివర్స్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో తెలియాంటే వచ్చే శని వారం వరకు వెయిట్‌ చేయాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.