Begin typing your search above and press return to search.

ప్రభాస్ సినిమా.. మారుతి లీక్ చేసిన ఫస్ట్ పిక్!

By:  Tupaki Desk   |   28 Feb 2023 8:07 PM
ప్రభాస్ సినిమా.. మారుతి లీక్ చేసిన ఫస్ట్ పిక్!
X
ప్రభాస్ చేస్తున్న ప్రస్తుత సినిమాల్లో అందరికీ ఆసక్తి కలిగిస్తున్న సినిమా ఏదైనా ఉందంటే ప్రాజెక్టు కే, స్పిరిట్ అని అంటారు కానీ... ప్రభాస్ అభిమానులకు మాత్రం మారుతీ సినిమా మీద సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద ప్రభాస్ హీరోగా మారుతీ ఒక హారర్ కామెడీ సినిమా చేస్తున్నాడనే వార్త తప్ప దానికి సంబంధించిన అధికారిగా సమాచారం కానీ ప్రకటన కానీ లేదు.

అయితే ప్రభాస్ మారుతి కలిసి ఒకటి రెండు ఫోటోలు కనిపించడంతో వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారనే విషయం ఖాయం అయినట్టే. ఇక ఆ సినిమాకి రాజా డీలక్స్ అనే పేరుని ఫిక్స్ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమా కథంతా ఒక పెద్ద ఇంటి చుట్టూనే జరుగుతుందని ఒక ప్రచారం ఉంది. తాజాగా అది నిజమని ప్రూవ్ అయింది. ఎందుకంటే డైరెక్టర్ మారుతీ స్వయంగా ఈ సినిమా షూటింగ్స్ పార్ట్ లో నుంచి ఆ ఇంటి ఫోటోలు షేర్ చేశారు.

ఆయన తన పర్సనల్ మీడియా ఎకౌంట్లో ఆ వింటేజ్ సెట్ ముందు కూర్చుని ఫోన్లో ఏదో చూసుకుంటున్నట్లుగా ఉన్న ఫోటోను షేర్ చేశారు. అలాగే ఒక పాత కుట్టు మిషన్ మీద కూర్చుని ఏదో కుడుతున్నట్టుగా నటించారు. తనకు బాల్య జ్ఞాపకాలు గుర్తొచ్చాయని పేర్కొన్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రభాస్ మారుతి సినిమా ఏదో కొత్త ఫ్లేవర్ తో ఉండబోతుందని అంటున్నారు.

ఈ ఫోటోలు ఎప్పుడైతే మారుతీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు బీభత్సమైన వైరల్ అయిపోతున్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. మరో 10 రోజులు పాటు ఇదే సెట్లో షూటింగ్ జరిపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 70 ఏళ్ల ప్రాంతాలలో జరిగిన కొన్ని సీన్లు కూడా సినిమాలో ఉంటాయని ప్రచారం జరుగుతోంది. పీపుల్స్ వీడియో ఫ్యాక్టరీ ఈ సినిమా షూటింగ్ విషయంలో ఎలాంటి లీకులు బయటకు రాకుండా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. కానీ నేరుగా మారుతి ఈ విషయాన్ని షేర్ చేయడంతో ఆసక్తి నెలకొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.