Begin typing your search above and press return to search.
ఎక్స్ క్లూజివ్: డార్లింగ్ కొత్త సినిమా కథ ఇదే
By: Tupaki Desk | 10 May 2020 6:11 AM GMTప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వైజయంతీ మూవీస్ వారు ప్రతిష్టాత్మకంగా ఓ భారీ ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సోషియో ఫాంటసీ జోనర్ లో తెరకెక్కుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లానింగ్ జరుగుతోందట. తాజాగా ఈ సినిమా స్టోరీలైన్ బయటకు వచ్చింది.
ఒక మానవుడు.. దేవకన్యకు పుట్టిన పిల్లాడు ఈ భూమి మీద ఎలాంటి విన్యాసాలు చేయగలడు.. ఈ భూమి మీద ఆ వ్యక్తి ఎలా జీవిస్తాడు అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమా కథను దర్శకుడు నాగ్ అశ్విన్ రెడీ చేస్తున్నారట. ఈ లైన్ చూస్తుంటే 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమా కథకు కొనసాగింపు అన్నట్టుగా ప్రేక్షకులకు అనిపించకమానదు. ఏదేమైనా ప్రభాస్ ఇప్పటికే 'బాహుబలి' లాంటి ఫాంటసీ తరహా సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు కాబట్టి ఈ కథ తప్పనిసరిగా సూట్ అవుతుందని మాత్రం చెప్పొచ్చు. సూపర్ హీరో సినిమాల స్టైల్ లో ఉండే కథాంశం కాబట్టి ప్రభాస్ కు ఉన్న లార్జర్ దేన్ లైఫ్ ఇమేజ్ కు నప్పుతుందని అనుకోవచ్చు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నారట. అందరూ పాన్ ఇండియా అంటున్నప్పటికీ నాగ్ అశ్విన్ మాత్రం ఓ అంతర్జాతీయ స్థాయి చిత్రంగా మలచాలనే ఆలోచనలో ఉన్నారట.