Begin typing your search above and press return to search.
భర్త సైఫ్ పై నిందలు వేసిన కరీనా
By: Tupaki Desk | 20 Dec 2018 6:04 AM GMTబాలీవుడ్ స్టార్స్ ఈమద్య టాక్ షోలతో బీజీ అవుతున్నారు. ఎంతో మంది స్టార్స్ ఎవరికి వారు టాక్ షోలు నిర్వహిస్తున్నారు. అదే దారిలో కరీనా కపూర్ కూడా ఒక టాక్ షో కు హోస్ట్ చేస్తుంది. తాజాగా ఆమె టాక్ షోలో మాజీ పోర్న్ స్టార్, ప్రస్తుత బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ పాల్గొంది. పలు ఆసక్తికర విషయాలను సన్నీలియోన్ ఈ షోలో షేర్ చేసుకుంది. సన్నీలియోన్ వ్యక్తిగత మరియు సినీ విషయాల గురించి కరీనా కపూర్ ఈ షో ద్వారా రాబట్టగలిగింది.
సన్నీలియోన్ తన ముగ్గురు పిల్లల ఆలన పాలన విషయంలో భర్త డానియల్ చాలా హెల్ప్ చేస్తాడట. ఒక పాపను దత్తత తీసుకున్న సన్నీ దంపతులు సరోగసి ద్వారా సంతానంను కూడా పొందిన విషయం తెల్సిందే. ముగ్గురు పిల్లలతో సన్నీలియోన్ ఇబ్బంది పడకుండా ఆమె భర్త ఆమెకు అన్ని పనుల్లో కూడా సహాయ సహకారాలను అందిస్తూ ఉంటాడట. పిల్లలకు డైపర్లు మార్చడం - స్నానం చేయించడం - తినిపించడం వంటివి చేస్తాడని డానియల్ గురించి సన్నీలియోన్ చెప్పుకొచ్చింది.
డానియల్ ను అభినందిస్తూ కరీనా కపూర్ తన భర్తపై సున్నింతంగా నిందలు వేసింది. అంతా కూడా సన్నీ భర్త నుండి నేర్చుకోవాలని, పిల్లల విషయంలో తండ్రులు కూడా పట్టించుకోవాలంటూ తన భర్త సైఫ్ అలీ ఖాన్ ను ఉద్దేశించి అంది. తన భర్త ఈ విషయాలను ఎప్పుడు నేర్చుకుంటాడో అంటూ నవ్వుతూ భర్త పై కరీనా కపూర్ పంచ్ వేసింది. తన కొడుకు విషయంలో సైఫ్ ఎలాంటి పనులు చేయడని, ఎప్పుడు కూడా అన్ని నేనే చూసుకోవాలని అంది. మరి ఈ విషయమై సైఫ్ అలీ ఖాన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.