Begin typing your search above and press return to search.
ప్రయోగం ఫెయిలైతే మళ్లీ చేయలేం!- ఆది
By: Tupaki Desk | 5 July 2019 6:53 AM GMTవరుసగా ఒకే తరహా సినిమాలు చేసే ఆసక్తి లేకనే `సుకుమారుడు` లాంటి ప్రయోగం చేశాను. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. కానీ నటుడిగా బాగా చేశావని ప్రశంసించారు.. ప్రయోగం ఫెయిలైతే మళ్లీ మళ్లీ చేయలేం!! అని అన్నారు ఆది సాయికుమార్. అతడు నటించిన మరో ప్రయోగాత్మక చిత్రం `బుర్రకథ` నేడు ప్రపంచవ్యాప్తంగా థియేర్లలోకి రిలీజైంది. డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆది సాయికుమార్ మీడియాతో ముచ్చటిస్తూ పైవిధంగా స్పందించారు. ఈసారి బుర్రకథతో హిట్టు కొట్టి తీరతానని నమ్మకం వ్యక్తం చేశారు.
ఆది మాట్లాడుతూ..``ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నింటిలోకి `బుర్రకథ`లో ఛాలెంజింగ్ రోల్ చేశాను. రెండు బుర్ర లు .. రెండు రకాల ఆలోచనలు ఉన్న కుర్రాడి కథ ఇది. ఇలాంటి దమ్మున్న పాత్ర చేస్తేనే మనలోని నటుడు బయటికొస్తాడని ఎంచుకున్నా. రెండు పాత్రల కోసం కష్టపడ్డాను అనే కంటే ఈజీగానే ఈజ్ తో చేశాను అనడం కరెక్ట్. మామూలుగా నా సినిమాలన్నీ వినోదానికి ప్రాధాన్యతనిచ్చేవే. ప్రేమకావాలి.. లవ్ లీ చిత్రాల్లో కామెడీ నేను చేయను. కథలోనే కామెడీ ఉంటుంది. రత్నబాబు ఈసారి కామెడీ పాళ్లు పెంచారు. థియేటర్ లో అవి ఎలా పండుతాయో చూడాలన్న ఉత్సాహం కలిగింది. నేను నటించిన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త పాయింట్ ఉండి తీరుతుంది. సుకుమారుడు లో గ్రేషేడ్స్ ఉన్న పాత్ర చేశాను. ఒకే రకమైన పాత్రలు వద్దనుకుని చేసిన చిత్రమది. ఫెయిలవ్వడం వల్ల ఎవరూ పట్టించుకోలేదు. గాలిపటం- శమంతక మణి లాంటి ప్రయోగాలతోనూ పేరొచ్చింది`` అని అన్నారు.
``బుర్రకథ` పేరుతో పాటు డబ్బు తెస్తుంది. ఇందులో లూజర్ గా... ఫైటర్ గా కనిపిస్తాను. లూజర్ కిందపడగానే ఓడిపోయాను అని వెళ్లిపోతాడు. కానీ ఫైటర్ కిందపడ్డా లేచి పరిగెత్తాలి.. రేసులో నిలవాలి అని ఆలోచిస్తాడు! అని తెలిపారు. తదుపరి సినిమాల గురించి చెబుతూ `ఆపరేషన్ గోల్డ్ ఫిష్` కొంత సీజీ బ్యాలెన్స్ ఉంది. మరో రెండు నెలల్లో రిలీజవుతుంది. జోడీ అనే క్యూట్ ఫ్యామిలీ లవ్ స్టోరీలో చేస్తున్నా. తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రం చేస్తున్నా. హారర్ థ్రిల్లర్ జోనర్ లో ఉంటుంది. సాయిరాజ్ అనే కొత్త దర్శకుడితో చేయబోతున్న చిత్రం షూటింగ్ ఆగస్ట్‌లో మొదలవుతుంది``అని ఆది తెలిపారు.