Begin typing your search above and press return to search.
ఆది కంబ్యాక్ ఈసారైనా సాధ్యమేనా?
By: Tupaki Desk | 26 Jun 2019 9:38 AM GMTయంగ్ హీరో ఆది సాయికుమార్ కెరీర్ డైలమా గురించి తెలిసిందే. బెటర్ కెరీర్ కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా గత కొంతకాలంగా అతడు వరుస పరాజయాలే ఎదురవుతున్నాయి. కెరీర్ లో సరైన బ్లాక్ బస్టర్ ఒక్కటీ లేదు. ప్రేమకావాలి చిత్రంతో తెరంగేట్రం చేసి అటుపై `లవ్ లీ` సినిమాతో హిట్టు కొట్టినా ఆ తర్వాత కెరీర్ ఆద్యంతం ఫ్లాపులు వెంటాడాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న గరమ్- చుట్టాలబ్బాయ్- శమంతక మణి లాంటి చిత్రాలు తన కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు. అటుపై కొన్ని సినిమాల్లో అతిధిగానూ కనిపించాడు. హవీష్ నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చిత్రంలోనూ అతిధి పాత్రలో నటించాడు.
ప్రస్తుతం రైటర్ టర్న్ డ్ డైరెక్టర్ డైమండ్ రత్నం దర్శకత్వంలో `బుర్రకథ` అనే ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రెండు బ్రెయిన్ లు ఉన్న కుర్రాడి బుర్రకథేమిటో తెరపైనే చూడాలని చెబుతున్నాడు ఆది. నేడు హైదరాబాద్ మీడియాతో ఇంటరాక్ట్ అయిన ఆది ఓసారి కెరీర్ పరంగా రివ్యూ చేసుకున్నాడు. అలాగే గతంలో చేసిన కొన్ని తప్పిదాలపై సమీక్షించుకున్నానని.. వాటిని ఇకపై చేయనని అన్నాడు.
ముఖ్యంగా లిప్ లాక్ లు వేసేందుకు ససేమిరా! అనేస్తున్నాడు ఆది. గాలి పటం.. రఫ్.. గరమ్.. చుట్టాలబ్బాయి లాంటి చిత్రాల్లో ఆది సాయికుమార్ తన కథానాయికలతో కాస్తంత ఇంటిమేట్ గానే నటించాడు. కథానాయికలతో లిప్ లాక్ సన్నివేశాలపైనా చర్చ సాగింది. అయితే అలా చేయడం వల్ల ఫ్యామిలీ ఆడియెన్ తనకు దూరమవుతున్నాడని భావించానని.. ఇకపై లిప్ లాక్ సన్నివేశాల్లో నటించేందుకు వ్యతిరేకమని చెప్పి పెద్ద షాకిచ్చాడు. ఇకపై తాను చేసే సినిమాలన్నీ కుటుంబ సమేతంగా చూడదగ్గవే అయ్యి ఉండాలని భావిస్తున్నానని అన్నాడు. బుర్రకథ అన్ని వర్గాలకు చేరువయ్యే సినిమా. కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఉంటుందని ఆది సాయికుమార్ తెలిపాడు. ఈ సినిమా తర్వాత తెలుగు - తమిళ్ ద్విభాషా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నానని అన్నాడు. కార్తీక్ - విఘ్నేష్ లతో కలిసి ఈ ప్రాజెక్టు కోసం పని చేస్తున్నానని వెల్లడించాడు.
ఆసక్తికరంగా బుర్రకథ స్టోరీని ఆది లీక్ చేశారు. రామ్ - అభి కవల పిల్లలు .. మేం ఒకటే. ఒకటే బాడీ. కానీ రెండు బుర్రలు. ఆ ఇద్దరి బుర్రకథే మా బుర్రకథ అంటూ ఆది కథను రివీల్ చేసారు. మందు-మగువకోసం తపిస్తూనే గుడికెళ్లి దేవుడికి మొక్కుతాననే తత్వం ఉన్న కుర్రాడి కథ ఇది. రెండు వ్యతిరేక లక్షణాల్ని కలిపి ఒకడిలోనే చూపిస్తే బుర్రకథ అని కథను లీక్ చేశాడు. ఇక ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ తండ్రి పాత్రలో నటించారు. తండ్రితో కలిసి మందేసే కొడుకుగానూ ఆది కనిపించనున్నాడు. ఈనెల 28న సినిమా థియేటర్లలోకి రిలీజవుతోంది. ఈ సినిమా విజయంపై ఆది ఎంతో ధీమాని కనబరిచారు.