Begin typing your search above and press return to search.
హీరో అజిత్ అభిమాని ఆత్మహత్య… కారణం ఏంటంటే?
By: Tupaki Desk | 22 Jan 2023 5:35 AM GMTఈ మధ్యకాలంలో చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు ఎక్కువైపోయారు. అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, లవర్ వదిలేసిందని, పరీక్షల ఫెయిల్ అయ్యానని ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో హీరోల అభిమానులు కూడా మూవీ టికెట్ దొరకలేదని, తమ అభిమాన హీరోని చూడలేకపోయాను అని ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. అలాగే తమ అభిమాన హీరో సినిమా ప్లాప్ అయిందని ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉన్నారు.
అయితే తాజాగా మరో రకమైన సంఘటన తమిళనాడులో తూత్తుకుడిలో జరిగింది. తమిళనాడులో హీరో అజిత్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో పవన్ కళ్యాణ్ కి ఎలా ఫాలోయింగ్ ఉంటుందో అదే విధంగా తమిళనాడులో అజిత్ కి కూడా ఉంది.
సంక్రాంతి సందర్భంగా అజిత్ హీరోగా నటించిన తెగింపు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా యావరేజ్ స్టాక్ వచ్చిన కూడా ప్రేక్షకుల నుంచి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అజిత్ ఫ్యాన్స్ విపరీతంగా ఈ సినిమా చూడడానికి థియేటర్స్ కి వెళ్లారు. అయితే వీరబాగు అని వ్యక్తి అజిత్ వీరాభిమాని. అతను అజిత్ సినిమాలకు ఫ్యామిలీతో కలిసి మొదటి రోజు మొదటి ఆటకు వెళుతూ ఉంటారు. అలాగే తెగింపు మూవీ రిలీజ్ రోజు కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాడు.
అయితే అతను మద్యం తాగి ఉండడంతో థియేటర్ యాజమాన్యం సినిమా చూసేందుకు అనుమతించలేదు. రిక్వెస్ట్ చేసిన కూడా లోపలికి అనుమతి చెప్పడంతో వీరబాగు వారితో గొడవపడ్డాడు. అయితే థియేటర్ యాజమాన్యం అతనితో పాటు ఫ్యామిలీని కూడా బయటకి పంపించేశారు. దీంతో తన అభిమాన హీరో సినిమా చూడటానికి వస్తే అవమానం జరిగిందని భావించిన వీరబాగు నేరుగా ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అభిమానంతో సినిమాకి వెళ్తే అవమానించడం వలన ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది.