Begin typing your search above and press return to search.
'ఇస్మార్ట్ శంకర్' నా హిట్ సినిమాకి కాపీ!- హీరో ఆకాశ్
By: Tupaki Desk | 22 July 2019 3:02 PM GMTరామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన `ఇస్మార్ట్ శంకర్` కథాంశంపై కాపీ క్యాట్ వివాదాల గురించి తెలిసిందే. ఈ సినిమా బేసిక్ లైన్ ని ఓ రెండు హాలీవుడ్ సినిమాల నుంచి పూరి కాపీ చేశారని ప్రచారం సాగింది. తాజాగా హీరో జై ఆకాశ్ ఈ సినిమాపై తీవ్ర ఆరోపణలు చేశారు. `ఇస్మార్ట్ శంకర్` చిత్రం నా సినిమాకి కాపీ అంటూ తెలుగు మీడియా ముందు ఆరోపించడం హాట్ టాపిక్ గా మారింది.
ఒకరి ఆలోచనల్ని ఇంకొకరి మెదడులోకి పంపిస్తే తదనంతర పర్యవసానాలేమిటి? అన్న కాన్సెప్టుతో తాను ఒక సినిమా తెరకెక్కించానని ఆ సినిమా తమిళంలో ఇప్పటికే రిలీజై విజయం సాధించిందని ఆకాశ్ తెలిపారు. పూరి తెరకెక్కించిన `ఇస్మార్ట్ శంకర్` ఇంచుమించు అదే కథతో రావడం తనను షాక్ కి గురి చేసిందని అన్నారు. నా సినిమా కథలో లండన్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. హీరో ఇద్దరిలానే ప్రవర్తిస్తాడు. కానీ ఇస్మార్ట్ శంకర్ లో ఆంధ్రా - తెలంగాణ నేపథ్యం చూపించారు. హీరో పాత్ర చిత్రణ ఒకేలా ఉన్నా బ్యాక్ డ్రాప్ మారిందని తెలిపారు. ఆకాష్ మాట్లాడుతూ-``ఇస్మార్ట్ శంకర్ హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో తీసినదని అన్నారు. ఐ బోయ్ .. క్రిమినల్ చిత్రాల స్ఫూర్తి ఉంది. అయితే `ఐ బోయ్` 2017లో రిలీజైంది. అలాగే క్రిమినల్ 2016లో రిలీజైంది. ఈ రెండు సినిమాలు రిలీజ్ కాక ముందే నేను తెరకెక్కించిన `నాన్ యార్` తమిళంలో రిలీజైంది. అక్కడ చక్కని విజయం అందుకుంది. ఈ సినిమాని తెలుగులో `కొత్తగా ఉన్నాడు` పేరుతో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాను. ఈలోగానే ఇస్మార్ట్ శంకర్ రిలీజైంది. ఇక నేను నా చిత్రాన్ని రిలీజ్ చేయలేని పరిస్థితి నెలకొంది`` అని ఆరోపించారు. `నాన్ యార్` సినిమాని ఇంగ్లీష్ లోనూ తెరకెక్కించేందుకు బ్రిటన్ లో స్క్రిప్టును రిజిస్టర్ చేయించాననని ఆకాశ్ వెల్లడించారు.
ఈ విషయంపై దర్శకుడు పూరి జగన్నాథ్ ని సంప్రదించేందుకు ప్రయత్నించినా అతడు అందుబాటులోకి రాలేదని అతడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారని.. దాంతో ఈ వ్యవహారంపై తమిళ నిర్మాతల సంఘాన్ని ఆశ్రయించానని ఆకాశ్ తెలిపారు. తన వాదన నిజం అని నిరూపించే ఆధారాల్ని తెలుగు మీడియా కి చూపించారు. సమస్య సామరస్యంగా పరిష్కారం కానీ పక్షంలో లీగల్ గా పరిష్కారం కోరతామని హెచ్చరించారు. ఈ స్క్రిప్టు విషయమై పూరీని సంప్రదించేందుకు ప్రయత్నించినా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చిందని ఆకాశ్ ఆరోపించారు. పూరి ఫోన్ తీయకపోవడంతో అటుపై తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ ని సంప్రదించానని వెల్లడించారు. ప్రస్తుతం సి.కళ్యాణ్ చెన్నయ్ నిర్మాతల మండలిలో చర్చించేందుకు వెళ్లారు. నా సినిమాని ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేయలేని పరిస్థితి ఉంది. నన్ను నేను నిరూపించుకునేందుకు చేసిన ప్రయత్నం వృధా పోతోందని ఆకాశ్ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ సెలబ్రేషన్ లో ఉన్న పూరీని నిరాశపరచడం ఇష్టం లేకే తాను వెంటనే కోర్టులకు వెళ్లలేదని ఆకాశ్ తెలిపారు. పూరితో తనకు చాలా సాన్నిహిత్యం ఉందని అన్నారు. తన సినిమాకి జరిగిన డ్యామేజ్ ని సరిదిద్దేందుకు పూరి తనకు ఆర్థికంగానూ సహాయపడతారని ఆశిస్తున్నానని ఆకాశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.