Begin typing your search above and press return to search.

ఆకాశ్ కోసం వ‌ర్మ శిష్యుడ్ని దించుతున్నారా?

By:  Tupaki Desk   |   1 Jun 2023 8:00 AM GMT
ఆకాశ్ కోసం వ‌ర్మ శిష్యుడ్ని దించుతున్నారా?
X
డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి వార‌సుడు ఆకాష్ కి ఇంకా స‌రైన సౌండింగ్ హిట్ ప‌డ‌లేదు. అన్ని సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద చ‌ప్ప‌గానే తేలిపోయాయి. చివ‌రికి పూరి రంగంలోకి దిగినా ప‌న‌వ్వ‌లేదు. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ చేసిన `మెహ‌బూబా` కూడా నిరాశ‌నే మిగిల్చింది. ఆ త‌ర్వాత చేసిన `రొమాంటిక్`..`చోర్ బ‌జార్` అంటూ రెండు ప్ర‌య‌త్నాలు చేసినా! క‌నెక్ట్ అవ్వ‌లేదు. ఆ ర‌కంగా ఆకాష్ నుంచి అప్ డేట్ వ‌చ్చి సుమారు ఏడాద‌వుతుంది.

జూన్ లో `చోర్ బ‌జార్` రిలీజ్ అయింది. 2023 జూన్ వ‌స్తుంది. ఇంత వ‌ర‌కూ కొత్త సినిమా ప్ర‌క‌ట‌న లేదు. దీంతో ఆకాష్ త‌దుప‌రి ఏ సినిమా చేస్తాడు? ఎలాంటి ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేస్తాడు? ఎలాంటి క‌థాంశం తో వ‌స్తాడు? వంటి సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం వెలుగులోకి వ‌స్తుంది. ఆకాష్ కోసం పూరి -వ‌ర్మ అండ్ కో ఏకంగా ముంబై నుంచి ఓ ద‌ర్శ‌కుడిని ర‌ప్పిస్తున్న‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. అత‌ను వ‌ర్మ శిష్యుడ‌ని స‌మాచారం. గ‌తంలో హిందీలో వ‌ర్మ తెర‌కెక్కించిన కొన్ని సినిమాల‌కు ప‌నిచేసాడుట‌.

అలాగే పూరి తెర‌కెక్కించిన `బుడ్డా హోగా తేరా బాప్` సినిమాకి కూడా అత‌ను అసోసియేట్ గా ప‌నిచేసాడుట‌. ఇప్పుడా యంగ్ మేక‌ర్ ని ఆకాష్ కోసం సీన్ లోకి తెస్తున్న‌ట్లు పూరి కాంపౌండ్ వ‌ర్గాల స‌మాచారం. ఇప్ప‌టికే డిస్క‌ష‌న్స్ కూడా షురూ చేసారుట‌. ఆకాష్ గ‌త రెండు నెల‌లుగా రెగ్యుల‌ర్ డిస్క‌ష‌న్స్ లో పాల్గోంటున్నాడు. పూరి కేవ్ లోనే తిష్ట వేసిన‌ట్లు స‌మాచారం.

ఈ యువ మేక‌ర్ సెల‌క్ష‌న్ పూర్తిగా వ‌ర్మ‌దేన‌ట‌. అత‌నే ఆకాష్ కి త‌గ్గ ద‌ర్శ‌కుడు ఇత‌న‌ని తీసుకొచ్చిన‌ట్లు స‌మాచారం. గురువు మాట‌ని శిష్యుడు పూరి ఎందుకు కాదంటాడు. ఆయ‌న‌లో సంగం పూరి. కాబ‌ట్టి ఆయ‌న ఏం చెబితే అది వేద మంత్రంలా పాటిస్తాడు. కాబ‌ట్టి మ‌రో రెండు ..మూడు నెల‌ల్లో ఆకాష్ కొత్త ప్రాజెక్ట్ విష‌యాలు అధికారికంగా బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. ఇక పూరి త‌న స్క్రిప్ట్ ప‌నుల్లో తాను బిజీగా ఉన్న‌ట్లు తెలుస్తుంది.