Begin typing your search above and press return to search.
పాలిటిక్స్ పై హీరో అల్లరి నరేష్ కీలక వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 24 Nov 2022 12:30 PM GMTఅల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం'. ఉ.ఆర్. మోహన్ దర్శకుడు. ఆనంది హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని జీ స్టూడియోస్ తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ నిర్మించారు. అభివృద్ధికి దూరంగా వుండే గిరిజన ప్రాంతాల సమస్యలని వెండితెరపై ఆవిష్కరిస్తూ ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు.. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. మంచి టాక్ ని, ఎక్స్ పెక్టేషన్స్ సొంతం చేసుకున్న ఈ మూవీని నవంబర్ 25న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా అల్లరి నరేష్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. 'నాంది' సినిమాతో కొత్త తరహా సినిమాలకు శ్రీకారం చుట్టిన నరేష్ తనతరహా కామెడీ సినిమాలకు భిన్నంగా అడుగులు వేస్తూ కొత్త తరహా సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే 'నాంది' వంటి విభిన్నమైన సినిమా తరువాత 'ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం' మూవీతో ప్రేక్షకుల ముందురు రాబోతున్నాడు. ఈ మూవీని ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
'నేను' సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, ఆ మూవీ విడుదలయ్యాక నా రేంజ్ మారిపోతుది అనుకున్నానని, అయితే అది జరగలేదన్నాడు. అయితే ఈ మూవీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయినా ఎన్నో జ్ఞాపకాల్ని మిగిల్చిందన్నాడు. ఈ సినిమా వల్లే 'గమ్యం, శంభో శివ వంభో, మహర్షి సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందన్నాడు. అంతే కాకుండా 'నాంది' సినిమాలో నటించే అవకాశం నన్ను వెతుక్కుంటూ రావడానికి కారణం 'నేను'నే అన్నాడు.
ఇక ఇదే సందర్భంగా రాజకీయాలపై, రాజకీయాల్లోకి రావడంపై అల్లరి నరేష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. రాజకీయాలు నాకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్. రాజకీయాలు నాకు తెలియదు. అందులోకి వెళ్లాలని నేను ఎప్పుడూ అనుకోలేదు.
సినిమాల్లోనే సక్సెస్ అయితే చాలు అనుకున్నాను. అయితే డైరెక్టర్ అవుతా కానీ రాజకీయాల్లోకి మాత్రం వెళ్లను. నేను చాలా సెన్సిటివ్. సెన్సిటివ్ వుండే వాళ్లకు రాజకీయాలు పనికిరావు' అంటూ రాజకీయాలపై తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించారు అల్లరి నరేష్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.