Begin typing your search above and press return to search.
బిచ్చగాడిని 'కిల్లర్' కాపాడేనా ?
By: Tupaki Desk | 1 Jun 2019 12:11 PM GMTబిచ్చగాడుతో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిపోయిన విజయ్ ఆంటోనీకి ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. వరుసగా బాక్స్ ఆఫీస్ మీద దండయాత్రలు చేస్తూనే ఉన్నా ఒక్కటంటే ఒక్కటీ కనీస స్థాయిలో ఆడకపోవడం మార్కెట్ ని బాగా డ్యామేజ్ చేసింది. భేతాళుడుతో మొదలుపెట్టి మొన్నటి రోషగాడు దాకా పదికి పైగా వచ్చాయి కానీ ఏదీ ప్రేక్షకులకు గుర్తు లేవంటే ఏ స్థాయిలో ఆడాయో అర్థం చేసుకోవచ్చు.
ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కిల్లర్ తో వస్తున్నాడు విజయ్ ఆంటోనీ. ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. రంజాన్ పండగ సందర్భంగా జులై 7న విడుదల చేయబోతున్నట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ట్రైలర్ ఆన్ లైన్ లో ఉంది. స్పందన పెద్దగా లేకపోయినా రిలీజయ్యాక లెక్క మారుతుందని విజయ్ ఆంటోనీ
నమ్ముతున్నాడు
ఇదో సైకలాజికల్ కిల్లర్ స్టొరీనే. యాక్షన్ కింగ్ అర్జున్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా చాలా కీలకమైన పాత్ర చేస్తున్నారు. పోస్టర్స్ లో హీరోతో సమానంగా ఈయనకూ స్పేస్ ఇవ్వడం చూస్తే వెయిట్ చాలా ఉందని అర్థమైపోతోంది. ఇప్పటిదాకా సాఫ్ట్ మొదలుకుని మాస్ మసాలాల దాకా అన్ని రకాల రోల్స్ ట్రై చేసిన విజయ్ అంటోనీ ఇప్పుడు హంతకుడిగా ఎలా కనిపించబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.
ఇది ఆడితే లాభమే కాని పోతే విజయ్ అంటోనీకి కొత్తగా పోయేది ఏమి ఉండదు. హిట్ అయితే కొంత మార్కెట్ లో మళ్ళి పుంజుకోవచ్చు. లేదంటే ఇప్పటికే విజయ్ అంటోనీ సినిమాలు ఎలా ఉంటాయో అలవాటైన ప్రేక్షకులు ఇంకేమి ఆశించకూడదని డిసైడ్ అవుతారు. మరి కిల్లర్ హీరోకి సహాయపడతాడా లేక ఉన్న కొంత మార్కెట్ ని కిల్ చేస్తాడా వచ్చే 7న తేలిపోతుంది