Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ లోనూ శుభ‌లేఖ‌లు పంచాలి!

By:  Tupaki Desk   |   28 Feb 2019 5:15 AM GMT
టాలీవుడ్‌ లోనూ శుభ‌లేఖ‌లు పంచాలి!
X
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్.. ప‌రిశ్ర‌మ ఏదైనా బ్యాచిల‌ర్ హీరోల పెళ్లిళ్ల‌పై నిరంత‌రాయంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుంటుంది. టాలీవుడ్ లో ఇప్ప‌టికే అర‌డ‌జ‌ను మంది యువ హీరోల పెళ్లిళ్ల గురించి వేడెక్కించే డిష్క‌స‌న్ సాగుతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ ప్ర‌భాస్, రానా, నితిన్, అఖిల్, శ‌ర్వానంద్, రాజ్ త‌రుణ్ వంటి యంగ్ బోయ్స్ పెళ్లి ఎప్పుడు? అంటూ ఇప్ప‌టికే యూత్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.

వీళ్ల‌తో పాటే ఇటీవ‌ల తెలుగువాడైన త‌మిళ హీరో విశాల్ పెళ్లి గురించి, తెలుగు వారికి సుప‌రిచితుడు.. త‌మిళ హీరో ఆర్య పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆ ఇద్ద‌రూ నిన్న మొన్న‌టివ‌ర‌కూ పెళ్లంటే దూరంగానే ఉన్నారు. ఉన్న‌ట్టుండి ప్రేమ‌లో ప‌డ్డాం.. పెళ్లికి రెడీ అవుతున్నాం! అంటూ కార్డులు పంచేస్తుండ‌డంపై ఆస‌క్తిక‌రంగా ముచ్చ‌టించుకుంటోంది యూత్. విశాల్ పెళ్లి కార్డ్ ఇంకా పంచలేదు కానీ, ఆర్య పెళ్లి కార్డ్ అప్పుడే అచ్చేయించి రెడీ చేసేశాడు. అంద‌రికీ పంప‌కాలు అయిపోతున్నాయి. వీళ్ల‌ను చూస్తే మిగ‌తా ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ కి ఈ ఐడియా ఎందుకు రాదు? ప‌క్కోడికి పెళ్లియిపోతోంది.. అన్న క‌నీస‌ చింత అయినా లేదా? ఎంత‌సేపూ ఏ బాక్సాఫీస్ రికార్డు ఏంటో? అన్న లెక్క‌ల గురించి ముచ్చ‌టేనా? అస‌లు ముచ్చ‌ట లేదా? అంటూ ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు జ‌నం.

మ‌న కుర్రాళ్ల‌లో అర‌డ‌జ‌ను మంది బ్యాచిల‌ర్స్ ఉన్నారు. వాళ్లెవ‌రో అంద‌రికీ తెలుసు. రానాకి ప్ర‌భాస్.. ప్ర‌భాస్ కి రానా.. నితిన్ కి అఖిల్.. అఖిల్ కి నితిన్.. ఇలా కార్డులు పంచుకునేదెపుడు? రాజ్ త‌రుణ్ .. త‌నీష్.. శిరీష్‌ ఇత‌ర బ్యాచిల‌ర్లు బోలెడుమంది ఉన్నారు. అయితే ఆ దృశ్యం చూసేదెపుడు? ఆ స‌న్నివేశం ఎప్ప‌టికి? అంటూ ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. విశాల్ - ఆర్య‌లా.. ఇలా కార్డులు పంచే స‌న్నివేశం కోస‌మే అంతా వేచి చూస్తున్నారు. ఓవైపు ఇళ్ల‌లో తొంద‌ర పెడుతున్నా.. పెళ్లి కి ఎందుకు స్కిప్ కొట్టేస్తున్నారు అన్న‌ది తేలాల్సి ఉంది. స‌యేషా సైగ‌ల్ తో త‌న పెళ్లి సంద‌ర్భంగా ఆర్య త‌న మిత్రుడు `వాడు వీడు` కొలీగ్ విశాల్ కి శుభ‌లేఖ ఇచ్చాడు. ఈ సంద‌ర్భంగా కాబోయే జంట‌ను విశాల్ బ్లెస్ చేశాడు. ఇక విశాల్ విష‌యానికి వ‌స్తే నటి అనీశాతో అత‌డి పెళ్లి జరగనుంది. త్వరలో హైదరాబాద్‌లో నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నారు. న‌డిగ‌ర సంఘం బిల్డింగ్ ఓపెన్ చేయించి అప్పుడు అందులో పెళ్లాడ‌తాన‌న్నాడుగా విశాల్ భ‌య్యా!!