Begin typing your search above and press return to search.
స్టార్ హీరో తమ్ముడి ప్రేమ పెళ్లి
By: Tupaki Desk | 10 April 2019 8:02 AM GMTతమిళ స్టార్ హీరో శింబు తమ్ముడు కురలరసన్ కొన్ని నెలల క్రితం ముస్లీం మతంను స్వీకరించిన విషయం తెల్సిందే. తండ్రి టి రాజేందర్ పక్కనే ఉండి తనయుడికి ముస్లీం మతం ఇప్పించాడు. ఉన్నట్లుండి కురలరసన్ ఎందుకు ముస్లీం మతంను స్వీకరించాల్సి వచ్చింది అంటూ సర్వత్రా చర్చ జరిగింది. అయితే ముస్లీం మతంను స్వీకరించడం వెనుక ప్రేమ వ్యవహారం ఉందనే వార్తలు వచ్చాయి. ఆ విషయమై అప్పుడు ఎలాంటి క్లారిటీ అయితే శింబు కుటుంబ సభ్యులు ఇవ్వలేదు కాని, తాజాగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు కురలరసన్ ముస్లీం మతంను స్వీకరించినట్లుగా వెళ్లడయ్యింది.
కురలరసన్ వివాహం ఈనెల 26వ తారీకున నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ముస్లీం అమ్మాయి నిబీలా అహ్మద్ తో కురలరసన్ వివాహం జరుగనుంది. ప్రస్తుతం రాజేందర్ మరియు శింబులు సినీ పరిశ్రమలో ప్రముఖులకు ఇన్విటేషన్ కార్డులను ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. నిబీలా కుటుంబ సభ్యులు కురలరసన్ ముస్లీం మతంను స్వీకరిస్తేనే పెళ్లికి ఒప్పుకుంటామని చెప్పడంతో అందుకు సిద్దం అయ్యాడు. వీరి వివాహం గ్రాండ్ గా చెన్నైలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. అన్నయ్య శింబు పెళ్లి ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నాడనే టాక్ తమిళ మీడియాలో నడుస్తోంది.