Begin typing your search above and press return to search.

ప్రియుడితో కొత్త ఇంటికి మారిన‌ హీరో కూతురు

By:  Tupaki Desk   |   24 Aug 2022 4:09 AM GMT
ప్రియుడితో కొత్త ఇంటికి మారిన‌ హీరో కూతురు
X
సినిమా తార‌లు క్రికెట‌ర్ల‌తో ప్రేమ‌లో ప‌డ‌డం రొటీన్. గ్లామ‌ర్ రంగంతో క్రికెట‌ర్ల అనుబంధం ఎప్పుడూ నెక్ట్స్ లెవ‌ల్ కి చేరుకోవ‌డం చూస్తున్న‌దే. చాలా మంది యువ క్రికెట‌ర్లు సినిమా క‌థానాయిక‌ల‌ను ప్రేమించి పెళ్లాడారు. లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో కుమార్తె ఆథియా శెట్టితో యువ క్రికెట‌ర్ కె.ఎల్.రాహుల్ నిండా ప్రేమ‌లో మునిగిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట షికార్లు ప్ర‌తిసారీ హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

తాజా స‌మాచారం మేర‌కు.. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి కూతురు బాయ్ ఫ్రెండ్ రాహుల్ తో కలిసి కొత్త ఇంటికి వెళ్లింది. వారిద్దరూ ఇప్పుడు ముంబై కార్టర్ రోడ్ లోని సముద్రానికి ఎదురుగా ఉన్న కొత్త ఇంటికి మారారు.

అది ఒక విశాలమైన అంద‌మైన‌ ఇల్లు.. అక్కడ ఆమె తల్లిదండ్రులు గృహప్రవేశం తర్వాత అధికారిక పూజను నిర్వహించారు. అథియా గ‌త‌ మూడు సంవత్సరాలుగా KL రాహుల్ తో డేటింగ్ చేస్తోంది త్వ‌ర‌లోనే ఈ జంట పెళ్లికి రెడీ అవుతున్నార‌ని కూడా క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.

అథియా పెళ్లి గురించి ప్రశ్నించగా.. తండ్రి గారైన‌ సునీల్ శెట్టి ఏమ‌న్నారంటే... ''కాలం మారినందున వారు ఏమి చేయాలనుకుంటున్నారో వారే నిర్ణయించుకుంటారు. ఆ ఇద్ద‌రూ మంచి నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి'' అని అన్నారు.

అతియా చివరిసారిగా 2019లో 'మోతీచూర్ చక్నాచూర్‌' అనే చిత్రంలో న‌టించింది. 2015 నుండి ఇప్పటివరకు నాలుగు సినిమాలు మాత్ర‌మే చేసింది. ఆథియా హీరో అనే చిత్రంతో క‌థానాయిక‌గా ఆరంగేట్రం చేసింది. ఆ సినిమాలో న‌ట‌న‌కు ఉత్త‌మ డెబ్యూగా ఫిలింఫేర్ కూడా అందుకుంది.

అయితే ఆ త‌ర్వాత కెరీర్ ప‌రంగా ఎక్కువ సినిమాలు చేయ‌లేదు. క‌థానాయిక‌గా కెరీర్ గురించి ఆథియా అంత సీరియస్ గా ఉన్న‌ట్టు అనిపించ‌దు. ప్ర‌స్తుతానికి త‌న చెలికాడితో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయ‌డానికే ఆథియా ప్ర‌యారిటీ ఇస్తోంది.