Begin typing your search above and press return to search.
ఆ కేసులో ప్రముఖ హీరోను అరెస్ట్
By: Tupaki Desk | 10 July 2017 3:35 PM GMTప్రముఖ మలయాళ హీరో దిలీప్ అరెస్ట్ అయ్యారు. ప్రముఖ నటి అత్యాచార యత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన్ను.. పోలీసులు గతంలో సుదీర్ఘంగా విచారించి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. దాదాపు ఐదు నెలల క్రితం (ఫిబ్రవరి 17) రాత్రి తన కారులో వెళుతున్న నటిని కొందరు అడ్డగించి.. రోడ్డు మీద వాహనాన్ని తిప్పుతూ దాదాపు రెండున్నర గంటల పాటు లైంగిక దాడికి గురి చేసిన వైనం అప్పట్లో సంచలనం సృష్టించింది.
ఈ సమయంలో ఆమెకు సంబంధించిన అశ్లీల ఫోటోల్ని తీశారు. ఈ కేసులో ఆమె డ్రైవర్.. మాజీ డ్రైవర్ తో పాటు పలువురు కుట్ర పన్నినట్లుగా చెప్పుకున్నారు. నటి లైంగిక దాడి వెనుక మలయాళ సినీ ప్రముఖుల హస్తం ఉందన్న విమర్శలు వినిపించాయి. ఇదిలా ఉండగా.. ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేయటం వెనుక మలయాళ సినీ హీరోల్లో ముఖ్యుల్లో ఒకరైన దిలీప్ ఉన్నట్లుగా గుర్తించారు. రెండు వారాల క్రితం ఆయన్ను 12 గంటల పాటు విచారించారు.
వ్యక్తిగత కక్షతోనే నటిని కిడ్నాప్ చేయించి.. వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన్ను అరెస్ట్ చేయటంతో ఇప్పటివరకూ వినిపించిన ఆరోపణల్లో నిజం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక.. దారుణం జరిగిన రాత్రి ఏం జరిగిందన్నది చూస్తే.. ఫిబ్రవరి 17 సాయంత్రం ఏడు గంటల వేళలో నటి వెళుతున్నకారును కిరాయి మూక ఒకటి వ్యాన్ తో ఢీ కొట్టింది.
దీంతో ఆమె కారు ఆగిన వెంటనే ఇద్దరు నిందితులు ఆమె కారులోకి చొరబడి ఆమె నోటికి మూసేశారు. కేకలు వేయొద్దంటూ బెదిరించారు. ఆమె ఫోన్ ను లాక్కొన్నారు. కొంతదూరం ప్రయాణించాక మూడో నిందితుడు కారు దిగిపోగా.. నాలుగో నిందితుడు కారు ఎక్కాడు. అనంతరం మరో ఇద్దరు నిందితులు వాహనంలోకి వచ్చారు. వాహనం రూటు మార్చి ఓ ఇంటి వద్ద ఆపారు. అక్కడి నుంచి ప్రధాననిందితుడు పల్సర్ సుని ముఖానికి టవల్ కట్టుకొని వచ్చి డ్రైవర్ సీటులోకి మారాడు. కారును కక్కనాడ్‌కు తీసుకెళ్లి అక్కడ నటిని లైంగికంగా వేధించాడు. అశ్లీలంగా వీడియోలు తీసేందుకు థర్డ్ పార్టీ తరఫున తాను వచ్చానని.. సహకరించాలని బెదిరించాడు.కాసేపు నటిని అసభ్యంగా చిత్రీకరించిన తర్వాత ఆమెను కక్కనాడ్ సమీపంలోని పాదముద్గల్ వద్ద కారులో నుంచి కిందకు తోసేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు చిత్ర హింసలకు గురి చేసిన ఈ ఉదంతం అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.