Begin typing your search above and press return to search.
బాలయ్య ఎందుకు కొట్టారు? అంటే.. కుర్ర హీరో వివరణ ఇదీ!!
By: Tupaki Desk | 18 Nov 2020 3:10 PM GMTనటసింహా నందమూరి బాలకృష్ణ ఇటీవల రకరకాల కారణాలతో హాట్ టాపిక్ గా మారారు. ఓ పోస్టర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ప్రవర్తనపై రకరకాల కామెంట్లు వినిపించాయి. హర్ష్ కానుమిల్లి హీరోగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కజిన్ నిర్మిస్తున్న `సెహరి` ఫస్ట్ లుక్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలయ్య అందరూ చూస్తుండగానే తన ఫోన్ ని విసిరికొట్టడం.. పోస్టర్ తాకుతున్న హీరో చేతిని తోసి వేయడం.. అంకుల్ అని పిలిచిన నిర్మాత జిష్ణుపై గుర్రుగా చూడడం ఇవన్నీ అందరి కంటా పడ్డాయి.
దీంతో బాలయ్యపై నెటిజనులు ట్రోల్ చేశారు. ఆయన కోపిష్ఠి అని ప్రవర్తన ఎప్పటికీ మార్చుకోలేరేమో! అంటూ ఘాటైన వ్యాఖ్యలే చేశారు. నిజానికి వాటిని చూసే కోణాన్ని బట్టి కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుందేమో! అన్న సపోర్టివ్ వ్యాఖ్యలు కూడా వినిపించాయి.
మొబైల్ ఫోన్ విసిరేయడం.. ఫస్ట్‌లుక్ పోస్టర్ పట్టుకోబోతే హీరో చేతిని కొట్టడం.. అంకుల్ అని పిలిచిన నిర్మాత (కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడు) జిష్ణు రెడ్డిని గుర్రుగా చూడడం..ఇవన్నీ ఆ సందర్భంలో చూపరులకు కాస్త ఎబ్బెట్టుగా మొరటుగా కనిపించాయి. అయితే అలా బాలయ్య ఎందుకు చేశారో చెప్పరా ప్లీజ్!! అని అడిగితే సెహరి హీరో హర్ష్ క్లారిటీ ఇచ్చేశారు.
``ఫస్ట్‌లుక్ లాంచ్ చేసేటప్పుడు నేను పోస్టర్‌ని ఎడమచేత్తో పట్టుకున్నాను.. అలా మంచిది కాదు.. కుడి చేత్తో పట్టుకోవాలని చెప్తూ సరదాగా నా చేతిని తోశారు.. బాలకృష్ణ గారు మంచి మనసున్న వ్యక్తి`` అంటూ వివరణ ఇచ్చారు. దీంతో అయినా క్లారిటీ వచ్చిందా? చూసే కళ్లను బట్టే ఏదైనా మారుతుంది! అన్నది అందుకేగా!!