Begin typing your search above and press return to search.
హీరో.. హీరోయిన్లు.. ఓ 'చుట్ట’ కథ..!
By: Tupaki Desk | 23 Feb 2022 11:30 PM GMT'పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం.. క్యాన్సర్ కి కారకం' అని ఎన్ని బోర్డులు పెట్టినా.. పొగతాగడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో సినిమా టైటిల్స్ కు ముందు కళ్ళకు కట్టినట్లుగా చూపించినా జనాలలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదనే చెప్పాలి. పొగ పీల్చేవారి కంటే.. పక్కనుండే వారికి ఎక్కువ చేటు చేస్తుంది.. ఇబ్బంది పెడుతుంది.
ఇక సినిమా వాళ్లలో కూడా ఎక్కువ శాతం మంది స్మోకింగ్ చేసే అలవాటు ఉన్నవారున్నారు. షూటింగ్ సమయంలో కాస్త విరామం దొరికితే చాలు.. సెట్ లోనో లేదా కార్వాన్ లోకో వెళ్లి దమ్ము కొట్టే నటీనటులు ఉన్నారు. ఇది వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ.. పొగ అంటే పడని ఇతర ఆర్టిస్ట్స్ కు సమస్యగా మారుతుంది.
ఇప్పుడు ఇదంతా చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. టాలీవుడ్ లో ఓ హీరోకి ఉన్న ధూమపానం అలవాటు హీరోయిన్లకు తిప్పలు తెచ్చిపెడుతోందట. అనర్గళంగా డైలాగులు చెప్పడంలో తనకు తానే అనిపించుకున్న ఆ హీరోకి.. పొగాకుతో చేయబడిన 'చుట్ట' తాగే హ్యాబిట్ ఉంది. లొకేషన్స్ లో గ్యాప్ దొరికినప్పుడల్లా ఒకటి పీలుస్తుంటారు.
చుట్ట తాగితే గొంతు బాగా వస్తుందని.. అప్పుడు ఎలాంటి కఠినతరమైన డైలాగ్ అయినా చెప్పడగలమని ఆ హీరో నమ్ముతాడు. అయితే హీరోకి ఉన్న ధూమపానం అలవాటు ఆయనతో పనిచేసే హీరోయిన్లకు చికాకు కలిగిస్తోందట. అతనికి దగ్గరగా ఉంది యాక్ట్ చేయాల్సిన సన్నివేశాలప్పుడు అసౌకర్యంగా ఉంటున్నారట. చుట్ట వాసన భరించలేక అనేక సార్లు దర్శక నిర్మాతలకు కూడా ఫిర్యాదు చేశారట.
పొగాకు వాసన వల్ల వాంతులు అవుతున్నాయని కూడా చెబుతున్నారు. అయితే కోపస్తుడికి ముద్రపడిపోయిన హీరోకి ఈ విషయం గురించి చెప్పడానికి సెట్ లో ఎవరూ సాహసించడం లేదు. దీంతో దర్శక నిర్మాతలతో హీరోయిన్లు గొడవ పడే పరిస్థితి వస్తోందట. ఇలాంటివి సహజమని.. వారితో కలిసి పని చేయాల్సి వస్తే అలాంటి వాటిని తట్టుకోవాల్సి ఉంటుందని వారికి నచ్చజెప్తున్నారట.
ఏదేమైనా సదరు హీరోకి ఉన్న చుట్ట తాగే అలవాటు హీరోయిన్లకు తంటాలు తెచ్చి పెడుతోందని తెలుస్తోంది. స్మోకింగ్ వదలలేక పోతే.. చుట్ట మానేసి కనీసం సిగరెట్ కి అయినా షిప్ట్ అయిపోమని ఎవరైనా ఆయనకు సలహా ఇస్తే బాగుండు అని హీరోయిన్లు అనుకుంటున్నారట.