Begin typing your search above and press return to search.
మహానాయకుడులో నాదెండ్లే విలనా.?
By: Tupaki Desk | 17 Feb 2019 7:31 AM GMTముందే చెప్పినట్లుగా అనుకున్న టైమ్ కు 5 నిమిషాలు ఆలస్యంలో మహానాయకుడు థియేట్రికర్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క షాట్ కూడా ఉపయోగించకుండా... మొత్తం రాజకీయ జీవితాన్నే ప్రస్తావించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టడం, ఆ తర్వాత నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్, ఇందిరాగాంధీతో గొడవలు.. వీటినే హైలెట్ చేసి చూపించారు.
మహానాయకుడు సినిమా అవ్వనీ వేరే సినిమా అవ్వనీ.. ప్రతీ సినిమాకు ఒక హీరో ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు. కథాపరంగా మొదటి సినిమా కథనాయకుడికి విలన్ అవసరం లేకుండా పోయింది. ఇక రెండో భాగం మహానాయకుడు సినిమాకు వచ్చేసరికి నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ నే బాగా హైలెట్ చేసినట్లు కన్పిస్తుంది. ఎన్టీఆర్‌కు పైలెట్ అయితే తాను కో పైలెట్ అని నాదెండ్ల భాస్కరరావు పాత్రతో డైలాగులు చెప్పించారు. ఇక ఒక సీన్ లో నాదెండ్ల భాస్కరరావు వంక సీరియస్ గా చూస్తున్న బాలయ్య షాట్‌ని కూడా ఉపయోగించారు. మొత్తంమ్మీద మహానాయకుడు సినిమాలో నాదెండ్ల ఎపిసోడ్ ని హైలెట్ చేసి.. భాస్కరరావునే మెయిన్ విలన్‌గా చూపించినట్లు అర్థం అవుతుంది. సినిమాలో తనని విలన్‌గా చూపిస్తే ఊరుకునేది లేదని కథానాయకుడు సినిమా రిలీజ్ టైమ్‌లో నాదెండ్ల హెచ్చరించారు. ఇప్పుడు ఈ ట్రైలర్ చూశాక.. మరి ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో మరి.