Begin typing your search above and press return to search.

డైరెక్ట‌ర్ ప‌నిలో హీరోగారి ఫింగ‌రింగ్

By:  Tupaki Desk   |   18 Dec 2019 1:30 AM GMT
డైరెక్ట‌ర్ ప‌నిలో హీరోగారి ఫింగ‌రింగ్
X
దర్శ‌కుల ప‌నిలో హీరోలు ఫింగ‌రింగ్ చేయ‌డం అన్న‌ది చాలాసార్లు వినేదే. క‌థ సెల‌క్ష‌న్ .. ట్యూన్స్ ఫైన‌ల్ చేయ‌డం.. డైలాగ్ ఓకే చెప్ప‌డం.. చివ‌రికి తీసే షాట్స్ లోనూ వేలు పెట్ట‌డం వ‌గైరా వ‌గైరా హీరోలే చేసేస్తుంటే ఇక ద‌ర్శ‌కుడు ఎందుకు? అన్న సందిగ్ధ‌త వ్య‌క్త‌మ‌వుతుంటుంది. ఒక్కోసారి ద‌ర్శ‌కుడికి క్రియేటివ్ ఫ్రీడ‌మ్ ఇవ్వ‌క‌పోతే ఏదో తీయ‌బోయి ఇంకేదో అయ్యే ప‌రిస్థితులు ఉంటాయి.

ప‌రిశ్ర‌మలో హీరో మాట‌కు ఎదురు చెప్ప‌లేక చాలా మంది ద‌ర్శ‌కులు సైలెంటుగా చెప్పింది వినాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. కొంద‌రు హీరో చెప్పింది విని తాము తీయాల్సిందే తీస్తారు. కానీ కొంద‌రు అలా కాకుండా మెత‌క స్వ‌భావం వ‌ల్ల హీరోకి దొరికిపోతుంటారు. పాపం ఆ డెబ్యూ ద‌ర్శ‌కుడు రెండో కేట‌గిరీకే చెందుతాడ‌ట‌. ఎర‌క్క‌పోయి ఇరుక్కుపోయాడ‌ట‌. స‌ద‌రు యంగ్ హీరో ఇప్ప‌టికే ఆన్ సెట్స్ ద‌ర్శ‌కుడిని డామినేట్ చేస్తూ త‌నదైన ప‌నిపాట‌వం చూపిస్తున్నాడ‌ట‌. షాట్ ఓకే చెప్ప‌డం మొద‌లు .. తీసిన‌ షాట్ ఫైన‌ల్ అయ్యిందా లేదా? అన్న‌ది కూడా హీరోనే డిసైడ్ చేస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టికే ర‌చ‌న‌లోనూ హీరో గారి హ‌స్తం ఉంది. లిరిక్స్.. పాట‌ల్ని త‌నే ఫైన‌ల్ చేశాడు. రైట‌ర్ గా పేరు వేయించుకుంటున్నాడు ప‌నిలో ప‌నిగా ద‌ర్శ‌క‌త్వంలోనూ ఫింగ‌రింగ్ చేస్తున్నాడ‌ట‌. షాట్ పూర్త‌వ్వ‌గానే ద‌ర్శ‌కుడు త‌న‌వ‌ద్ద‌కు వ‌చ్చి ఫైన‌ల్ చేయించుకోవాల్సిందేన‌ట‌. అస‌లే డెబ్యూ కావ‌డంతో హీరో చెప్పిందే వింటున్నాడ‌ట‌.

అయితే సినిమా సెట్స్ లో ఉన్న‌ప్పుడు ఈ త‌ర‌హా రూమ‌ర్లు స‌హ‌జం. హీరోల‌ సీనియారిటీ అనుభ‌వం దృష్ట్యా దానిని ఫింగ‌రింగ్ అని అనుకోరు కొంద‌రు. అయితే ఎవ‌రు ఎలా ఫింగ‌రింగ్ చేసినా అంతిమంగా హిట్టు అనేది డిసైడ్ చేస్తుంది. సినిమా ఫ్లాపైతే ద‌ర్శ‌కుడిదే భారం. ఫింగ‌రింగ్ చేస్తే హీరో భాగ‌స్వామ్యం ఉన్న‌ట్టు. సొంత బ్యాన‌ర్ సినిమా కాబ‌ట్టే ఆ ఇన్వాల్వ్ మెంట్. అయినా అన్నీ తానే అయ్యాడు కాబ‌ట్టి స‌ద‌రు హీరోనే హిట్టు ఫ్లాపు విష‌యంలో బాధ్య‌త వ‌హిస్తారేమో చూడాలి.