Begin typing your search above and press return to search.

10వేల ఎకరాల భూమికి నీరు.. కార్తిపై ప్రశంసలు

By:  Tupaki Desk   |   18 Sep 2020 3:30 PM GMT
10వేల ఎకరాల భూమికి నీరు.. కార్తిపై ప్రశంసలు
X
తమిళనాట హీరో సోదరులు ఇద్దరూ మనసున్న తారలుగా పేరు తెచ్చుకున్నారు. తెరమీదే కాదు.. తెర బయట కూడా ఎంతో మందికి సాయం చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.

తండ్రి శివకుమార్ అడుగుజాడల్లో హీరోలు సూర్య, కార్తి నడుస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఈ హీరోలు ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. సూర్య, కార్తి ఇద్దరూ వేర్వేరు ఆర్గనైజేషన్లు పెట్టి పలువురికి సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కార్తి తాజాగా 10వేల ఎకరాల భూమిని కాపాడారు.

హీరో కార్తి రైతుల కోసం ‘ఉళవన్’ అనే ఫౌండేషన్ స్థాపించాడు. వారి కోసం పలు కార్యక్రమాలను చేపట్టారు. తాజాగా రూ.4లక్షలను ఖర్చు చేసి ఉద్రపురం, తిరునెల్ వెలి జిల్లాలోని సూరపల్లి కాలువను శుభ్రం చేయిస్తున్నారు. 21 రోజుల క్రితం దీనికి సంబంధించిన పనులు ప్రారంభం కాగా.. త్వరలోనే పూర్తవ్వనున్నాయి.

ఈ కాలువ ద్వారా 10 గ్రామాల్లోని దాదాపు 10వేల ఎకరాల భూమికి నీరు అందనుంది. దీంతో కార్తి చేసిన పనిపై సర్వాత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రభుత్వాలే రైతులను పట్టించుకోని ఈ పరిస్థితుల్లో హీరో కార్తి చేసిన మేలుపై రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గతంలో కూడా కార్తి చాలా మంది రైతులకు సాయం చేశారు.