Begin typing your search above and press return to search.
`దేవ్` టైటిల్ వెనక టాప్ సీక్రెట్
By: Tupaki Desk | 10 Feb 2019 5:04 AM GMTకార్తీ- రకుల్ ప్రీత్ జంటగా నటించిన తాజా చిత్రం `దేవ్`. లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం రిలీజవుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని పందెంకోడి నిర్మాత ఠాగూర్ మధు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. అసలు డబ్బు అంటే పట్టించుకోని కుర్రాడు.. డబ్బు కోసం బిజినెస్ చేసే అమ్మాయికి మధ్య లవ్ అయితే ఎలా ఉంటుందో తెరపై చూపిస్తున్నామని హీరో కార్తీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పారు.
అయితే ఈ చిత్రానికి `దేవ్` అనే టైటిల్ నే ఎందుకు ఎంపిక చేశారు? చాలా టైటిల్స్ ఉన్నా దేవ్ అనే క్యారెక్టర్ పేరు ఎందుకు పెట్టారు? ఆ రహస్యం ఏంటి? అనే ప్రశ్న ను కార్తీని అడిగారు యాంకర్ ఝాన్సీ. దానికి కార్తీ నుంచి అంతే హుందా అయిన సమాధానం వచ్చింది. ``ఆ ప్రశ్న డైరెక్టర్ గారిని అడగాలి. టైటిల్ ఎంపిక ఆయనదే. `దేవ్` అనేది ఐడల్ నేమ్ .. మా డైరెక్టర్ లక్ష్మణ్ కపిల్ దేవ్ కి పెద్ద ఫ్యాన్. ఆ పేరులోంచి దేవ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. `దేవ్` అనే పేరు క్యాచీగా ఉంది. ఆయన ఈ టైటిల్ చెప్పగానే చాలా స్టైలిష్ గా ఉందని అనిపించింది. స్టైలిష్ ఫిలింకి తగ్గ టైటిల్ అని అనిపించింది`` అని తెలిపారు. మొత్తానికి దేవ్ టైటిల్ వెనక టాప్ సీక్రెట్ రివీలైనట్టే. కపిల్ `దేవ్`లోంచి దేవ్ ని బయటకు లాగారు.. క్యాచీగా రెండక్షరాలతో టైటిల్ పెట్టుకున్నారన్నమాట.
ఆ టైటిల్ కి తగ్గట్టే కార్తీ పాత్ర అంతే ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. సోషల్ మీడియా యుగంలో, ఇంటర్నెట్ ట్రెండ్ లో ఎవరెవరో ఎక్కడెక్కడి అమ్మాయితోనో పరిచయం పెంచుకుని ప్రేమలో పడిపోతున్నారు. ఖండాంతరాలు దాటి వెళుతోంది లవ్వు. అలా దేవ్ ఎక్కడో న్యూయార్క్ లో ఉన్న అమ్మాయి రకుల్ తో ప్రేమలో పడిపోతాడు. ఇద్దరి మైండ్ సెట్ లు వేరు. ఇద్దరి ఆలోచనలు వేరు. పూర్తి ఆపోజిట్ ఆలోచనలతో ఉండే పాజిటివ్ నెగెటివ్ కలిస్తే ఎలాంటి అగ్గి రాలింది? అన్నదే కథాంశం అని కార్తీ చెప్పకనే చెప్పారు. ఇందులో కార్తీ ఓ బైక్ రేసర్ గా కనిపించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రేమికుల కథాంశంతో తెరకెక్కిన సినిమా కాబట్టి దేవ్ ప్రేమికుల రోజున రిలీజవుతోందన్నమాట.