Begin typing your search above and press return to search.
చినబాబు ఆటో ఎక్కక తప్పలేదు!
By: Tupaki Desk | 17 July 2018 4:21 AM GMTఠారెత్తించే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య ఒక ప్రముఖ నటుడికి చుక్కలు చూపించింది. కారులో అయితే.. గమ్యస్థానానికి చేరుకోవటం మరింత ఆలస్యమవుతుందని భావించిన సదరు నటుడు.. ఆటోను ఆశ్రయించాడు. ఈ ఆసక్తికర ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
చినబాబు సక్సెస్ మీట్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. దీనికి హాజరయ్యేందుకు చినబాబు హీరో కార్తీ హైదరాబాద్ కు వచ్చారు. మాదాపూర్ వరకూ ఆయన కారులో వచ్చినా.. అక్కడ ఏర్పడిన భారీ ట్రాఫిక్ జాంలో చిక్కుకుపోయారు. కారులో వెళితే.. కార్యక్రమానికి అందుకోలేనని భావించిన ఆయన.. వెంటనే కారు దిగేసి ఆటో ఎక్కేశారు.
అయితే.. కార్తీ వెంట చినబాబు మూవీ నిర్మాత రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇరువురు కలిసి ఆటోలో ప్రసాద్ ల్యాబ్ కు చేరుకున్నారు. ప్రముఖ నటుడై ఉండి కూడా.. కార్యక్రమానికి ఆలస్యంగా హాజరు కాకూడదన్న ఉద్దేశంతో ఆటోలో వచ్చిన కార్తీని చూసిన అభిమానులు ఫిదా అయ్యారు. ఆ మధ్యన ఒక హీరోయిన్ కూడా ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నారు.
కార్యక్రమానికి ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతో ప్రొడక్షన్ కు సంబంధించిన వారి బైక్ ఎక్కి వెన్యూ చేరుకున్నారు. మొత్తానికి హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు సైతం చుక్కలు చూపిస్తోంది. తమను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన హైదరాబాద్ ట్రాఫిక్ జాంలపై ప్రముఖులు పెదవి విప్పితే ప్రభుత్వానికి చిరాకు కలగక మానదు.