Begin typing your search above and press return to search.

గాయమైనా అజిత్ బయటికి చెప్పలేదు: కార్తికేయ

By:  Tupaki Desk   |   20 Feb 2022 7:30 AM GMT
గాయమైనా అజిత్ బయటికి చెప్పలేదు: కార్తికేయ
X
కార్తికేయ హీరోగా తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువ ... తమిళ ప్రేక్షకులకు దాదాపు పరిచయం లేని ఫేస్. అలాంటి కార్తికేయ 'వలిమై' సినిమాలో పవర్ఫుల్ విలన్. తమిళనాట అజిత్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు.

ఆయన సినిమా వస్తుందంటే అక్కడి అభిమానులకు పండుగలన్నీ ఒక్కసారిగా పరిగెత్తుకు వచ్చినట్టుగా ఉంటుంది. అంతటి క్రేజ్ ఉన్న అజిత్ సినిమాలో చిన్న రోల్ దొరికినా చాలని చాలామంది ఆర్టిస్టులు అనుకుంటారు. కానీ చాలా తక్కువ సమయంలోనే ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కార్తికేయకు లభించడం విశేషం.

ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో కార్తికేయ మాట్లాడుతూ అజిత్ కి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నాడు. " అజిత్ సార్ విలన్ రోల్స్ చేయడంలో స్పెషలిస్ట్ .. నెగెటివ్ రోల్స్ చేయడంలో ఆయన ఆల్రెడీ తన మార్క్ చూపించారు.

అలాంటి ఆయన సినిమాలో నేను విలన్ రోల్ చేసే అవకాశం రావడం నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నాను. నా వైపు నుంచి 100 పర్సెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను.

అజిత్ గారి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. తన అభిమానులను ఆనదింపజేయడానికీ .. తన పాత్రకి న్యాయం చేయడానికి ఫిజికల్ గా ఆయన చాలా కష్టపడటం నేను చూశాను. అందుకే ఆయనకి అన్ని సర్జరీలు జరిగాయా అనుకున్నాను. '

వలిమై' సినిమా షూటింగులో కూడా నా కళ్లముందే ఆయన బైక్ పై నుంచి పడిపోయారు. అది చూసి నేను షాక్ అయ్యాను. కానీ ఆయన తన గురించి ఆలోచన చేయకుండా, డామేజ్ అయిన బైక్ గురించి ఆలోచించారు. మరుసటి రోజుకి ఆ బైక్ లేకపోతే షూటింగ్ ఆగిపోతుందని .. అప్పటికప్పుడు తన ఫ్రెండ్స్ కి కాల్ చేసి కొత్త బైక్ తెప్పించారు.

ఆ తరువాత నా బైక్ పై ఇద్దరం కలిసి తన కారవాన్ కి వెళ్లాము. అక్కడికి వెళ్లిన తరువాత ఆయన షర్ట్ విప్పితే ఒక చోట గాయమై బ్లడ్ రావడం చూశాను. 'ఎందుకు చెప్పలేదు సార్?' అని అడిగితే, కంగారుపడిపోయి షూటింగు ఆపేస్తారని చెప్పలేదు అన్నారు.

షూటింగు కేన్సిల్ అయితే కాంబినేషన్ డేట్స్ దొరకడం కష్టం అన్నారు. ఆ మాటకు మరోసారి షాక్ అయ్యాను. సెట్లో ఆయన ఎప్పుడూ చాలా కూల్ గా .. సరదాగా ఉంటారు. తాను భోజనం చేసిన .. టిఫిన్ చేసిన ప్లేట్ ను కూడా తానే క్లీన్ చేస్తారు. నేను ఎక్కడ ఉన్నా దగ్గరికి పిలిచి మరీ కూర్చో బెట్టుకుని కబుర్లు చెప్పేవారు. అలాంటి హీరోను నేను ఇంతవరకూ చూడలేదు" అని చెప్పుకొచ్చాడు.