Begin typing your search above and press return to search.
ఇక్కడో 90 ఎంఎల్ వస్తుంది
By: Tupaki Desk | 13 Feb 2019 8:56 AM GMTతమిళ్ లో లేటెస్ట్ సెన్సేషన్ గా నిలుస్తున్న ఓవియా 90 ఎంఎల్ ట్రైలర్ అక్కడ ప్రకంపలను సృష్టిస్తోంది. ఇందులో కంటెంట్ మీద ఓవియా రెచ్చిపోవడం గురించి చాలా విమర్శలు వస్తున్నప్పటికీ తనేమి వాటిని కేర్ చేయడం లేదు. పైగా నా లైఫ్ నా ఇష్టం అంటూ వీడియోలు కూడా పోస్ట్ చేస్తోంది. అయితే ఇది తెలుగులో అదే టైటిల్ తో రావడం జరగదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఆ టైటిల్ రిజిస్టర్ అయిపోయింది.
90ఎంఎల్ పేరుతో ఆరెక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా శేఖర్ రెడ్డి అనే డెబ్యూ దర్శకుడితో ఓ సినిమా ఉండబోతోంది. ఇది అధికారిక ప్రకటన రావడానికి కొంత టైం పడుతుంది కానీ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టు సమాచారం. హిప్పీతో పాటు మరో రెండు ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్న కార్తికేయ వాటి తర్వాత ఇది చేసే అవకాశం ఉంది. 90ఎంఎల్ టైటిల్ ని బట్టే ఇదేదో మందుకు సంబంధించిన కథలా అనిపిస్తోంది కదూ. హీరో పాత్రకున్న ప్రత్యేకమైన లక్షణాన్ని బట్టి అలా డిసైడ్ చేసినట్టుగా తెలిసింది.
నిర్మాతగా తొలుత సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఆర్బి చౌదరి పేరు వినిపించినప్పటికీ ఫైనల్ గా మిర్యాల రవీంద్రరెడ్డి చేతికి వచ్చిందని వినికిడి. అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే కానీ దీని గురించి క్లారిటీ రాదు. 90ఎంఎల్ టైటిల్ లో మందుబాబులకు కిక్కిచ్చే సౌండ్ ఉంది. ఓవియా సంగతి ఏమో కానీ కార్తికేయను ఈ నెంబర్ సెంటిమెంట్ ఏదో బాగున్నట్టు ఉంది. అప్పుడు ఆరెక్స్ 100తో సూపర్ హిట్. ఇప్పుడు అందులో పది తగ్గింది 90 ఎంఎల్ పేరుతో మరో మూవీ. కథల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్న కార్తికేయ టైటిల్స్ కూడా క్యాచీగా ట్రెండీగా బానే సెట్ చేసుకుంటున్నాడు.