Begin typing your search above and press return to search.

విక్ర‌మ వేద‌: హృతిక్ కంటే సైఫ్ బెట‌ర్ పెర్ఫామెన్స్?

By:  Tupaki Desk   |   4 July 2022 9:58 AM GMT
విక్ర‌మ వేద‌: హృతిక్ కంటే సైఫ్ బెట‌ర్ పెర్ఫామెన్స్?
X
ట్యాలెంటెడ్ ఆర్.మాధ‌వ‌న్ న‌టించిన 'రాకెట్రీ' ఇటీవ‌ల‌ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. న‌టుడిగానే కాకుండా ద‌ర్శ‌కుడిగానూ మాధ‌వ‌న్ కి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో మాధ‌వ‌న్ అలియా మ్యాడీ దాప‌రికం లేకుండా ప్ర‌తిదీ ఓపెన్ గా మాట్లాడుతున్నారు. సినిమాల గురించి స్టార్ల గురించి కూడా మ‌న‌సులో ఉన్న‌ది ఏదీ దాచుకోకుండా మాట్లాడుతున్నాడు.

ఆర్ మాధవన్ తన మనసులోని మాటను ఓపెన్ గా మాట్లాడుతున్నాడు. ప్రశ్నలకు సమాధానమిచ్చేటప్పుడు దూత‌లాగా డిప్ల‌మాటిగ్గా మాట్లాడటం త‌న‌కు న‌చ్చ‌డం లేదట‌. దాదాపు 20 ఏళ్ల తర్వాత హృతిక్ రోషన్- సైఫ్ అలీఖాన్ కలిసి 'విక్రమ్ వేద' హిందీ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మాతృక‌ తమిళ బ్లాక్ బస్టర్ లో విక్రమ్ గా ఆర్ మాధవన్ .. వేద పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. మాధవన్ హిందీ రీమేక్ కోసం చాలా ఉత్సాహంగా వేచి చూస్తున్నారు. రీమేక్ లో తన పాత్రను సైఫ్ ఖాన్ పోషిస్తున్నందున మ్యాడీ నటనను బీట్ చేయగలడేమో చూడాల‌న్నది అంద‌రి హోప్‌.

నేను రొటీన్ గా డిప్ల‌మాటిగ్గా సమాధానం చెప్పదలుచుకోలేద‌ని మ్యాడీ ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా అన్నారు. ఈ మూవీలో మేకోవ‌ర్ ప‌రంగా హృతిక్ రోషన్ చాలా అద్భుతంగా ఉన్నాడు. కానీ సైఫ్ నా పాత్ర‌ను పోషిస్తున్నందున అతని నటన ఎలా ఉంటుందో చూడాల‌ని నేను ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను. అతను నా కంటే బెట‌ర్ గా న‌టిస్తాడా? నన్ను ఓడిస్తాడా లేదా? అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను.

నాకంటే ఉత్త‌మంగా ప్రేక్ష‌కుల‌ను ఒప్పించగలడని.. అతను బాగా చేస్తాడనే భావన నాకు ఉంది! అని మాధవన్ అన్నారు. యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్ వేద' లో రాధికా ఆప్టే కూడా ప్రధాన పాత్రలో నటించింది. శుక్రవారం నాటికి టాకీ చిత్రీకరణ ముగిసింది. పుష్కర్ -గాయత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 2021లో మొద‌లైన సంగ‌తి తెలిసిందే. అబుదాబి- లక్నో- ముంబైలలో వివిధ షెడ్యూల్ లను పూర్తి చేసారు.

హృతిక్ - సైఫ్ లతో చిత్రీకరణ అనుభవం గురించి ద‌ర్శ‌కులు ఇరువురూ ''మన దేశంలోని పాపుల‌ర్ సూపర్ స్టార్లు హృతిక్ -సైఫ్ లతో షూటింగ్ చేయడం చాలా సంతోషకరమైన అనుభవం. అద్భుతమైన సిబ్బందితో మేము స్క్రిప్ట్ స్థాయిలో అనుకున్నది సాధించగలిగాం. ప్రేక్షకులకు మా చిత్రాన్ని చూపించడానికి ఇంకా వేచి ఉండలేము'' అని వ్యాఖ్యానించారు.

ఈ చిత్రం భారతీయ జానపద కథ 'విక్రమ్ ఔర్ బేతాళ్' ఆధారంగా రూపొందిస్తున్నారు. ఇది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్.. భయంకరమైన గ్యాంగ్ స్టర్ ను వెతకడానికి వేటాడేందుకు బయలుదేరిన కఠినమైన పోలీసు అధికారి కథకు దృశ్య రూపం. రెండు దశాబ్దాల తర్వాత ఒక హై-ఆక్టేన్ యాక్షన్ ఫిల్మ్ లో హృతిక్- సైఫ్ క‌లిసారు. ఆ ఇద్ద‌రి చేరిక‌తో ఈ చిత్రం నిస్సందేహంగా మోస్ట్ అవైటెడ్ చిత్రాల‌లో ఒకటిగా నిలిచింది.