Begin typing your search above and press return to search.
దర్శకుడిపైకి తప్పు నెట్టేసిన హీరో
By: Tupaki Desk | 14 May 2019 5:30 PM GMTసక్సెస్ వచ్చినప్పుడు పొగిడేయడం.. ఫెయిల్యూర్ ఎదుర్కొన్నప్పుడు ఢీలా పడిపోయి విమర్శలు గుప్పించడం .. ఇవి రెండూ సరికాదు. దర్శకులు హిట్లు.. బ్లాక్ బస్టర్లు ఇచ్చినప్పుడు పొగిడేసినట్టే ఫ్లాప్ ఇచ్చినప్పుడు తిట్టేయడం సరికాదు. రెండిటినీ సమానంగా తీసుకుని బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే ఒక సినిమా కథని హీరో అంగీకరించాకే పట్టాలెక్కిస్తారు. అంటే హీరోకి కూడా జయాపజయాల్లో సమాన భాగస్వామ్యం ఉన్నట్టే లెక్క. అందరూ హిట్టవ్వలానే తీస్తారు. కానీ కొన్ని మాత్రమే హిట్టవుతాయి. అదే ఈ రంగుల ప్రపంచం మాయ. ఫ్లాపుకి ఎట్నుంచి ఏ కారణం తరుముకొస్తుందో తెలీదు. అందుకే ఫ్లాప్ వచ్చినా దర్శకుడికి అండగా నిలవాల్సి ఉంటుంది. అలా కాకుండా తిట్టేస్తే అది అర్థం పర్థం లేనిది అంటూ విశ్లేషిస్తున్నారు.
ఇటీవలే ఓ కార్యక్రమంలో ఓ యంగ్ హీరో మాట్లాడుతూ.. ఆ ఫ్లాప్ కి కారణం దర్శకుడేనంటూ బహిరంగంగానే విమర్శించారు. ఓ బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా కొన్ని ఫ్లాపులు రావడంతో డీలా పడిపోయిన సదరు యంగ్ హీరో ఆ సినిమాల దర్శకుల వైపే వేలెత్తి చూపించారని గతంలో చెప్పుకున్నారు. తాజాగా ఓ కొత్త సినిమా ఓపెనింగ్ వేళ గత చిత్రం ఫ్లాప్ గురించి ప్రస్థావించి దర్శకుడి తప్పిదమే పరాజయానికి కారణం అంటూ సదరు దర్శకుడిపై విమర్శలు గుప్పించారు. అందులో తన భాగస్వామ్యం ఉందన్న విషయాన్ని మర్చిపోయారు.
అయితే సదరు యంగ్ హీరో ఇండస్ట్రీలో నేర్చుకోవాల్సింది చాలానే ఉందని క్రిటిక్స్ అంటున్నారు. కింగ్ నాగార్జున.. సూపర్ స్టార్ మహేష్ .. రామ్ చరణ్ .. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు తమ సినిమాలు ఫ్లాపైతే ఆ తప్పిదాన్ని దర్శకుడిపై నెట్టేయరు. అందులో తమకు కూడా వాటా ఉందని నిరభ్యంతరంగా వేదికలపైనే అంగీకరిస్తారు. దీన్నిబట్టి ఆ యంగ్ హీరో నేర్చుకోవాల్సినది చాలా ఉంది. కేవలం అది ఆ ఒక్క యంగ్ హీరోకే కాదు పరిశ్రమలో ఉన్న అప్ కం హీరోలందరూ తెలుసుకోవాల్సిన లేదా నేర్చుకోవాల్సిన పాయింట్ ఇది. జయాపజయాల్ని సమానంగా చూసినప్పుడే మనుగడ సాధ్యం ఇక్కడ. అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఓవర్ గా స్పందించడం సరికాదని సూచిస్తున్నారు.