Begin typing your search above and press return to search.

కోపం మంచి కోసమేనని కవర్ చేసుకుంటున్న శౌర్య!

By:  Tupaki Desk   |   27 Jan 2020 12:21 PM IST
కోపం మంచి కోసమేనని కవర్ చేసుకుంటున్న శౌర్య!
X
యువహీరో నాగశౌర్య మరో మూడు రోజుల్లో 'అశ్వథ్థామ' తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. సినిమా పై పాజిటివ్ బజ్ కూడా ఉంది. శౌర్య మొదటిసారిగా ఈ సినిమాలో యాక్షన్ హీరోగా కనిపించడంతో సినిమా ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. శౌర్య కూడా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈమధ్య శౌర్య ఇంటర్వ్యూ లో ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించాడు. తనకు కోపం ఎక్కువ అని.. అప్పుడప్పుడూ తన డైరెక్టర్లను రైటర్లను.. కెమెరామేన్ల ను అరుస్తానని చెప్పాడు. అయితే తన షార్ట్ టెంపర్ ను.. యాంగర్ ఇష్యూస్ ను శౌర్య సమర్థించుకోవడం గమనార్హం. ఇదంతా సినిమాను ఎలాగైనా హిట్ చేయాలనే తపనతో ఉన్న కారణంగా జరుగుతందని అన్నాడు. సినిమా విజయం సాధిస్తేనే తమ కెరీర్ కొనసాగుతాయని.. తన టీమ్ మెంబర్ల కెరీర్లు బాగుండాలనే ఉద్దేశం తో కేకలు వేస్తానని.. అంతకు మించి ఇంకేమీ లేదని చెప్పుకొచ్చాడు.

అయితే ఈ విషయంలో శౌర్యకు నెటిజన్ల నుండి కౌంటర్లు పడుతున్నాయి. కోప్పడే ప్రతి ఒక్కరికీ ఏదో కారణం ఉంటుందని కారణం లేకుండా ఎవరికీ కోపం రాదని.. అది సమస్య అని గుర్తించకుండా సమర్థించుకోవడం సరికాదని అంటున్నారు. శౌర్య చెప్పే లాజిక్ ప్రకారం పక్కవారి మంచి కోసం హీరోలు.. దర్శకులు కేకలు పెట్టడం అలవాటు చేసుకోవాలా? అని ప్రశ్నిస్తున్నారు. ఏంటో ఈ లాజిక్ పెద్దగా సెట్ అయినట్టు గా లేదు అశ్వథ్థామా!!