Begin typing your search above and press return to search.
పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్..
By: Tupaki Desk | 10 Nov 2021 9:34 AM GMTఫామ్ హౌస్ లో పేకాట కేసులో సినీ నటుడు నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 31న రాత్రి మంచిరేవులలోని హీరో నాగశౌర్య ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్నవిషయమై సమాచారం అందుకొన్న పోలీసులు దాడులు చేశారు. ప్రధాన నిందితుడు సుమన్ సహా 30 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.సుమన్ తో కలిసి శివలింగప్రసాద్ ఈ ఫామ్ హౌస్ లో పేకాట నిర్వహిస్తున్నారని పోలీసుల గుర్తించారు. దీంతో ఇవాళ శివలింగ ప్రసాద్ పోలీసులు అరెస్ట్ చేసి ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపర్చారు.
పుట్టినరోజు వేడకల కోసం సుమన్ ఈ ఫామ్ హౌస్ ను అద్దెకు తీసుకొన్నాడు.ఈ ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్నారని కచ్చితమైన సమాచారం మేరకు పోలీసులు ఈ ఫామ్ హౌస్ పై దాడి చేశారు. పేకాట ఆడుతూ మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య సహా పలువురు పోలీసులకు చిక్కారు. గుత్తా సుమన్ కుమార్ ఈ పేకాట నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులు, వీఐపీలు, రాజకీయ నేతలతో గుత్తా సుమన్ కుమార్ కు సంబంధాలున్నాయని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.
పేకాట ఆడేవారి కోసం సుమన్ కుమార్ ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశాడు. ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా పేకాట ఎక్కడ ఆడుతారోననే విషయమై సుమన్ కుమార్ సమాచారం చేరవేసేవాడు. డిజిటల్ రూపంలో డబ్బులను తీసుకొనేవాడు. ఈ డబ్బులను తీసుకొన్న తర్వాత సుమన్ కుమార్ కాయిన్స్ ను ఇచ్చేవాడని పోలీసులు చెబుతున్నారు. కాగా… ఈ కేసు లో గుత్తా సుమన్ కుమార్ కు ఉప్పరపల్లి కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ-1 గా ఉన్న గుత్తా సుమన్ కుమార్ ను ఇప్పటి వరకు కోర్టు ఆదేశాలతో పోలీసులు రిమాండ్ లో ఉంచారు.