Begin typing your search above and press return to search.
హీరో నాగశౌర్య తండ్రికి కోర్టులో ఊరట !
By: Tupaki Desk | 10 Nov 2021 11:59 AM GMTమంచిరేవుల ఫామ్ హౌస్ లో పేకాట దందా కేసులో అరెస్ట్ అయిన హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉప్పర్ పల్లి కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు మంచిరేవుల ఫామ్ హౌస్ లో పేకాట కేసులో శివలింగప్రసాద్ ను బుధవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 31న రాత్రి మంచిరేవులలోని హీరో నాగశౌర్య ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్నవిషయమై సమాచారం అందుకొన్న పోలీసులు దాడులు చేశారు. ప్రధాన నిందితుడు సుమన్ సహా 30 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
సుమన్ తో కలిసి శివలింగప్రసాద్ ఈ ఫామ్ హౌస్ లో పేకాట నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. దీనితో ఈ రోజు శివలింగ ప్రసాద్ పోలీసులు అరెస్ట్ చేసి ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చారు. పుట్టినరోజు వేడకల కోసం సుమన్ ఈ ఫామ్‌హౌస్ ను అద్దెకు తీసుకొన్నాడు.ఈ ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్నారని కచ్చితమైన సమాచారం మేరకు పోలీసులు ఈ ఫామ్ హౌస్ పై దాడి చేశారు. పేకాట ఆడుతూ మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య సహా పలువురు పోలీసులకు చిక్కారు. గుత్తా సుమన్ కుమార్ ఈ పేకాట నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులు, వీఐపీలు, రాజకీయ నేతలతో గుత్తా సుమన్ కుమార్ కు సంబంధాలున్నాయని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఆ రోజు మొత్తం 30 మంది వరకు పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్యతో పాటు నిజామాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల నుంచి వచ్చిన బడా బాబులు ఉన్నారు. పోలీసుల దాడుల సందర్భంగా క్యాసినో చిప్స్, కరెన్సీ, స్వైపింగ్ మెషీన్లు, మద్యం తదితరాలు పట్టుబడ్డాయి.