Begin typing your search above and press return to search.
ఐఫోన్ ఆర్డర్ చేసిన హీరోకు చేదు అనుభవం
By: Tupaki Desk | 4 Dec 2018 6:51 AM GMTఈమద్య కాలంలో మొత్తం షాపింగ్ అంతా కూడా ఆన్ లైన్ లోనే జరిగి పోతుంది. ఆన్ లైన్ వల్ల లాభం మాత్రమే కాకుండా నష్టం కూడా ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని సార్లు ఆర్డర్ చేసిన ఐటెం రాకుండా మరోటి రావడం లేదంటే డ్యామేజీ వస్తువు రావడం జరుగుతుంది. వందల్లో, వేలల్లో ఒక్కరికి అలా జరుగుతుంది. అలా తమిళ హీరో నకుల్ కు జరిగింది. నకుల్ తనకు ఎదురైన చేదు అనుభవంను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో సదరు ఆన్ లైన్ షాపింగ్ సంస్థ దిగి వచ్చి హీరో నకుల్ కు న్యాయం చేసేందుకు సిద్దం అయ్యింది.
నకుల్ తన మూడవ పెళ్లి రోజు సందర్బంగా భార్యకు ఐఫోన్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాడట. ప్రముఖ ఆన్ లైన్ స్టోర్ అయిన ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ కొత్త మోడల్ ను బుక్ చేశాడు. నకుల్ బుక్ చేసిన రెండు రోజులకు ఫోన్ వచ్చింది. బాక్స్ ఓపెన్ చేసి చూసిన నకుల్ షాక్ అయ్యాడట. అది ఐఫోన్ కాదు, ఐఓఎస్ సాఫ్ట్ వేర్ లేదని, అదో ఆండ్రాయిడ్ ఫోన్ అని తెలుసుకున్నాడు. దాంతో కంగుతిన్న హీరో వెంటనే స్థానికంగా ఉన్న ఫ్లిప్ కార్ట్ ఆఫీస్ ను సంప్రదించాడట. వారు ఆపిల్ స్టోర్ కు వెళ్లమని సూచించగా, అక్కడ కూడా సరైన సమాధానం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో సోషల్ మీడియాలో ఫ్లిప్ కార్ట్ మరియు యాపిల్ సంస్థలను ట్యాగ్ చేసి పోస్ట్ చేశాడు.
హీరో నకుల్ పోస్ట్ కు ఫ్లిప్ కార్ట్ ఇండియా స్పందించింది. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మీ ఆర్డర్ వివరాలను ఒక్కసారి పంపించండి అంటూ రిక్వెస్ట్ చేశారు. నకుల్ ఆర్డర్ చేసిన ఐఫోన్ త్వరలోనే అందిస్తామని ఫ్లిప్ కార్ట్ సంస్థ ప్రకటించింది. ఆన్ లైన్ లో ఇలాంటివి చాలా కామన్ గా జరుగుతుంటాయి. అయితే ఈసారి హీరోకు ఆ అనుభవం ఎదురవ్వడంతో అది కాస్త వైరల్ అయ్యింది.
నకుల్ తమిళంలో బాయ్స్ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. హీరోగా తెలుగులో కూడా ఒక చిత్రాన్ని చేసిన నకుల్ తమిళనాట మంచి నటుడిగా కొనసాగుతున్నాడు.