Begin typing your search above and press return to search.

యాంకర్ రష్మీపై ఫైర్ అయిన యంగ్ హీరో

By:  Tupaki Desk   |   18 Oct 2022 8:37 AM GMT
యాంకర్ రష్మీపై ఫైర్ అయిన యంగ్ హీరో
X
అప్పట్లో విశ్వక్ సేన్ తన సినిమా ప్రమోషన్ కోసం నడిరోడ్డు మీద 'బ్రో అంటూ చెప్పే ఒక మూవీ రివ్యూయర్ తో చేసిన ఫ్రాంక్ వీడియో' ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత టీవీ9 దీన్ని పెంట చేయడం.. విశ్వక్ సేన్ వచ్చి టీవీ9 యాంకర్ ను బెదిరించడంతో ఈ వివాదం కాస్తా విశ్వక్ సేన్ సినిమాకు మంచి ప్రమోషన్ గా పనికి వచ్చింది. అర్జున్ రెడ్డి విషయంలోనూ కాంగ్రెస్ నేత వీహెచ్ తో విజయ్ దేవరకొండ వివాదం అగ్గిరాజేసింది.

ఇప్పుడు అచ్చం అలాంటి వివాదం వార్తల్లో నిలిచింది. ఈసారి లొల్లి జరిగింది యాంకర్ రష్మీతో హీరో నందూకి.. 'ఎన్నిసార్లు ఫోన్ ఎత్తినా అస్సలు ఎత్తవని.. సినిమా ప్రమోషన్ కు రావడం లేదంటూ' యాంకర్ రష్మీపై హీరో నందూ ఫైర్ అయ్యాడు. ఆమె షూటింగ్ చేస్తున్న స్థలానికి వెళ్లి మరీ నానా హంగామా చేశాడు.

దీనికి రష్మీ కూడా రెచ్చిపోయింది... 'నేను రాను.. నాకు ఈ ఒత్తిడి తీసుకోవడం ఇష్టం లేదు' అంటూ నందు ముఖం మీదే చెప్పేసింది. ఈ వీడియో చూస్తే నిజంగానే రష్మీపై అంతలా నందు ఊగిపోయాడా? అని వీడియో చూసిన జనాలు అంతా షాక్ అయ్యారు.

కానీ చావు కబురు చల్లగా చెప్పారు ఈ ఇద్దరు. ఇదంతా తాము నటించిన కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం చేసిన ఫ్రాంక్ వీడియో అని అసలు విషయం చెప్పేశారు. 'నందూ, రష్మీ' జంటగా 'బొమ్మ బ్లాక్ బస్టర్' అనే సినిమా రూపొందింది. ఈ కుటుంబ కథా చిత్రానికి 'రాజ్ విరాఠ్ దర్శకుడు.

రెండేళ్ల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తయినా.. ఇప్పటివరకూ విడుదల చేయలేదు. సినిమా ఉందన్న విషయాన్ని మరిచిపోయారు. కానీ ఎట్టకేలకు అన్ని ఇబ్బందులను అధిగమించి సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

నవంబర్ 4న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అందుకే జనాల్లోకి సినిమాను తీసుకెళ్లడానికి వీలుగా ఈ ఫ్రాంక్ వీడియోను ప్లాన్ చేశారు. సినిమా అనౌన్స్ మెంట్ టైంలోనూ నందూ ఇలానే చేశాడు. బిబి లోకి ఎంట్రీ ఇస్తున్నానని పోస్ట్ పెట్టాడు. కానీ అది 'బొమ్మ బ్లాక్ బస్టర్' అని తర్వాత లెిసింది. చివరకు ఇప్పటికి కానీ ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.