Begin typing your search above and press return to search.
లెక్కలేసుకుని చేయలేదంటున్న నాని
By: Tupaki Desk | 22 Sep 2016 7:15 AM GMTఫలానా భాషలో ఈ తరహా సినిమాలు బాగా ఆడుతున్నాయి.. మన దగ్గర ఇలాంటి ట్రెండుంది.. ఇలా చేస్తే సినిమా హిట్టవుతుంది.. ఇలాంటి లెక్కలేవీ వేసుకోకుండా చేసిన సినిమా ‘మజ్ను’ అని నాని అన్నాడు. కొంత కాలంగా తన సినిమాలనగానే జనాలు ఎంతో నమ్మకంగా థియేటర్లకు వస్తున్నారని.. వారి నమ్మకాన్ని ‘మజ్ను’ ఎంతమాత్రం పోగొట్టదని.. ఏ రకమైన ఇబ్బందీ లేకుండా రెండున్నర గంటల పాటు వినోదాన్ని పంచే సినిమా ఇదని నాని ధీమాగా చెప్పాడు.
‘‘ఏ లెక్కలు వేసుకోకుండా చేసిన సినిమా మజ్ను. విరించి వర్మ నాకు దర్శకుడిగా కంటే వ్యక్తిగా చాలా ఇష్టం. అతడిలో నిజాయితీ.. సింప్లిసిటీ ఉంటాయి. ఆ రెండు లక్షణాలతోనే ఈ సినిమా కూడా తీశాడు. తన అనుభవాలతో స్వచ్ఛమైన కథ రాశాడు. తనకు తెలిసిన కథ చెప్పాడు. విరించితో నాకు ఎప్పట్నుంచో పరిచయం ఉంది. దర్శకుడు కాకముందు ‘నిన్నటి వెన్నెల’ అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు. అది కావాలంటే యూట్యూబ్ లో చూడండి. చాలా బాగుంటుంది. తర్వాత ‘ఉయ్యాల జంపాల’ కథను ఒపీనియన్ కోసం నాకే చెప్పాడు. కొత్తవాళ్లతో చేయమని చెప్పాను.
విరించితో సినిమా చేద్దాం అనుకుంటుండగానే కిరణ్ గారు అతణ్ని తీసుకుని నా దగ్గరికి కథతో వస్తున్నట్లు చెప్పాడు. అప్పుడే 50 శాతం ఈ సినిమా చేద్దామని ఫిక్సయ్యాను. కథ చెప్పాక 150 శాతం నమ్మకం కుదిరింది. ఈ సినిమాలో ఏది కూడా ఇలాగే ఉండాలి.. అలాగే ఉండాలి అనుకుని చేయలేదు. కథ ప్రకారం వెళ్లిపోయాం. ప్రథమార్ధంలోనే నాలుగు పాటలుంటాయి. ఇలాంటి సాహసం మామూలుగా ఎవరూ చేయరు. కానీ కథలో భాగంగా అవి వస్తాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రెండున్నర గంటల పాటు హాయిగా అనిపించే సినిమా ఇది. మొదలైనప్పటి నుంచి ప్రేక్షకుల ముఖాలపై చిరునవ్వు చెరిగిపోదు. ఎక్కడా ఒక్క సన్నివేశంలో కూడా ఏ ప్రేక్షకుడూ ఇబ్బంది పడడు. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి నిలబెట్టే సినిమా ఇది’’ అని నాని చెప్పాడు.