Begin typing your search above and press return to search.
తమన్నా అంటే భయం అంటున్న నాని
By: Tupaki Desk | 26 Sep 2016 8:49 AM GMTతమన్నా అంటే తనకు చాలా భయం అని నాని అన్నాడు. అందుకు ఆమె డ్యాన్సే కారణమన్నాడు. తనలా డ్యాన్స్ చేయలేనని తనకు బాధగా అనిపిస్తుందని.. అందుకే ఆమె డ్యాన్సింగ్ వీడియోలు చూడటానికి తాను ఇష్టపడనని నాని అన్నాడు. అభినేత్రి ఆడియో వేడుకలో నాని మాట్లాడుతూ.. ‘‘తమన్నా డ్యాన్స్ చూసిన తర్వాత నేను అలా డ్యాన్స్ చేయలేను అనిపించింది. అందుకే తమన్నా డ్యాన్స్ చేసిన వీడియో చూడకూడదు అనుకున్నాను. కానీ ఆ వీడియోను నేనే రిలీజ్ చేయాల్సి వచ్చింది. ప్రభుదేవాకు నేను చాలా పెద్ద ఫ్యాన్. చికుబుకు రైలే పాట అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఆ పాటకు డ్యాన్స్ చేయాలని ప్రాక్టీస్ చేసేవాడిని. డైరెక్టర్ విజయ్ సినిమాలంటే చాలా ఇష్టం. తమిళంలోని నా స్నేహితుల ద్వారా విజయ్ దర్శకుడిగా కన్నా వ్యక్తిగా ఇంకా గొప్పవాడని తెలిసింది’’ అని నాని అన్నాడు.
ఈ వేడుకలో కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘‘అభినేత్రి ఇంత భారీ సినిమా కావడానికి కారణం ప్రభుదేవా.ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. కానీ చాలా కష్టపడతారు. ఆయన్ని చూసే హార్డ్ వర్క్ నేర్చుకున్నాం. ప్రభుదేవా హీరోగా నటిస్తున్న సినిమాకు ‘అభినేత్రి’ అనే టైటిల్ సరిపోతుందా అని సందేహించాం. కానీ ప్రభుదేవా గారే మాకు ‘చంద్రముఖి’ టైటిల్ గుర్తు చేసి ‘అభినేత్రి’ అయితేనే బాగుంటుంది అన్నారు. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలో ఏ హీరోయిన్ అయినా నటిస్తే స్టార్ డమ్ వస్తుంది. కానీ తమన్నాఈ సినిమా కన్నా ముందే హీరో స్ధాయిలో ఇమేజ్ సొంతం చేసుకుంది. రచయితలందరికీ గర్వకారణమైన కొరటాల ‘అభినేత్రి’ ఆడియోను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. రచయితలకు ఇప్పుడింత గుర్తింపు వచ్చిందంటే కారణం కొరటాల శివనే’’ అన్నారు.