Begin typing your search above and press return to search.
నానీ.. ప్రమోషన్ లోనూ మగాడివేనోయ్
By: Tupaki Desk | 2 Sep 2015 10:37 PM GMTనానీ హీరోగా మారుతి దర్శకత్వంలో భలే భలే మగాడివోయ్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నెల 4న సినిమా రిలీజవుతోంది. ప్రస్తుతం ఇంటా బైటా ఈ సినిమా గురించిన డిష్కసనే. మారుతి ఈసారి పబ్లిసిటీ లోనూ స్పీడు పెంచాడు. సినిమాలో కంటెంట్ పరం గా మునుపటి తో పోలిస్తే సంథింగ్ స్పెషల్ గా ట్రై చేసి నట్టే కనిపిస్తోంది. ఇదో రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్ టైనర్. సంగీతం, ట్రైలర్ యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. అయితే అక్కడి తో ఆగకుండా ఈ సినిమా కి ప్రచారం లోనూ కొత్తదనాన్ని ఎంచుకున్నారు నాని అండ్ టీమ్.
ఏపీ, తెలంగాణ లో ఏకంగా 4 కోట్ల ఆర్టీసీ టిక్కెట్ల పై 'భలే భలే మగాడివోయ్' పోస్టర్ వేసి ప్రమోషన్ ప్లాన్ చేశారు. అలాగే డెయిలీ పత్రికల కు రెగ్యులర్‌గా యాడ్‌లు ఇస్తూ అందరి కీ టచ్‌లో ఉంటున్నారు. వెబ్ మీడియా, మ్యాగజైన్లు అనే తేడా లేకుండా అందరికీ ప్రకటనలు ఇచ్చి స్పీడ్ అంటే ఎలా ఉంటుందో చూపించారు. ఇక ఫేస్ బుక్, ట్విట్టర్ లో ప్రమోషన్ కి కొదువే లేదు. రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ హోర్డింగులు దర్శనమిస్తున్నాయి. నాని కెరీర్‌లో ఈ రేంజు ప్రచారం మునుపెన్నడూ లేనే లేదు. ఈసారి ఏమాత్రం కంటెంట్ ఉన్నా హిట్ కొట్టినట్టే.