Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ది నాని ఎఫెక్ట్

By:  Tupaki Desk   |   24 Feb 2019 6:35 AM GMT
ఫోటో స్టొరీ: ది నాని ఎఫెక్ట్
X
న్యాచురల్ స్టార్ నాని ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా నాని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ.. ఫ్రెండ్స్.. ఇండస్ట్రీ కొలీగ్స్ అందరూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చాలామంది అలా విషెస్ తెలిపినప్పటికీ నిర్మాత.. నిహారిక ఎంటర్టైన్మెంట్ అధినేత వెంకట్ బోయినపల్లి తెలిపిన విషెస్ మాత్రం వాటిలో ప్రత్యేకంగా నిలుస్తోంది.

'ది నాని ఎఫెక్ట్' అనే టైటిల్ తో నాని గురించి ఒక చిన్నపాటి వ్యాసం లాంటి కవిత.. కవిత లాంటి పొగడ్త తో గ్రీటింగ్ కార్డ్ లా పోస్ట్ చేశారు ఆయన. ఈ ఫోటోలో ఒక సూపర్ పోజులో ఉన్న నాని ఫోటో ఉంది. "వేయి కలలకు ప్రేరణనిచ్చే ఓ ఫేస్.. నవ్వే సమయంలో బుగ్గపై వచ్చే డింపుల్ ఎదుటివారిని మంత్రముగ్ధులను చేస్తుంది" అంటూ స్టార్ట్ చేసి మొత్తం తొమ్మిది లైన్ల కవిత రాసి ఫైనల్ గా ఇదంతా "నాని ఎఫెక్ట్" అని తేల్చేసి.. "బర్త్ డే విషెస్ టూ అవర్ హీరో" అంటూ ముగించారు.

ఈ కవిత నాని అభిమానులను విపరీతంగా మెప్పిస్తోంది. నిజమే నాని మాయలో పడని వారెవ్వరు? నానిని 'మనలో ఒకడు' అనుకోకుండా ఉండేదెవ్వరు? అసలు ఆ సహజత్వానికి మురిపోయే కదా తెలుగు ప్రేక్షకులు నాని ని న్యాచురల్ స్టార్ అని ప్రేమగా పిలుచుకునేది. ఆ 'నాని ఎఫెక్ట్' తెలుగు వారికే పరిమితం కాకుండా భారతదేశమంతా విస్తరించాలని కోరుకుందాం. మా తుపాకి తరఫున కూడా న్యాచురల్ స్టార్ నానికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.