Begin typing your search above and press return to search.

ఇంటర్యూః నా రియల్‌ క్యారెక్టర్‌నే తెరపై...

By:  Tupaki Desk   |   3 Sep 2015 7:29 AM GMT
ఇంటర్యూః నా రియల్‌ క్యారెక్టర్‌నే తెరపై...
X
నాని హీరోగా మారుతి దర్శకత్వం వహించిన 'భలే భలే మగాడివోయ్‌' ఈ శుక్రవారం రిలీజవుతోంది. ఈ సందర్భంగా నాని చెప్పిన సంగతులివి...

=మారుతి తో సినిమా అనగానే కొన్ని సందేహాలు. వాటినే అతడి ముందు ఉంచితే.. అవన్నీ సరే, ఇప్పుడు ఆ జోనర్‌ నుంచి మారాలనుకుంటున్నా అంటూ కథ చెప్పడం మొదలెట్టాడు. కథ వింటుంటే నవ్వులే నవ్వులు. నాన్‌ స్టాప్‌ గా నవ్వించాడు. మతిమరుపు క్యారెక్టర్‌ ని అద్భుతం గా నేరేట్‌ చేశాడు.

=బిజీ లైఫ్‌ లో మతిమరుపు సహజం అయిపోయింది. ఒకేసారి ఒకటికి మించి పది పనులు మీద పడే పరిస్థితి. ఇలాంటి సన్నివేశంలో ఏదో ఒక పనిని మర్చిపోవడం కామన్‌ పాయింట్‌. అయితే అందుకు డిఫరెంట్‌ గా మరికొందరు ప్రవర్తిస్తుంటారు. ఒక పని మీద బయల్దేరి, మార్గ మధ్యంలో వేరొకదానికి అడిక్ట్‌ అయిపోయి అసలు పని మర్చిపోతుంటారు. ఇంట్లో కూరగాయలు తెమ్మని చెప్పినా, ఏదైనా మార్కెట్లోంచి కొని తెమ్మన్నా.. ఆ విషయం గురించి ఆలోచించకుండా ఫ్రెండు కలిశాడని సినిమాకి వెళ్లిపోయే బాపతులే ఎక్కువ. వీళ్లంతా గజినీల టైపే. ఇలాంటివాళ్లకు ఎప్పటికప్పుడు చీవాట్లు కూడా తప్పవు. ఆ తర్వాత ఇంటికొచ్చి ఆడాళ్లతో చీవాట్లు తినకుండా తప్పించుకునేందుకు నవ్వుతూ మాట్లాడేస్తూ మ్యానేజ్‌ చేసేస్తుంటారు. ఇలాంటి అనుభవాలెన్నో.. నిజ జీవితంలో ఎదురయ్యాయి.

=ఇంట్లో పని కోసం వెళ్లి ఎవరో కలిస్తే గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించి అసలు పని మర్చిపోయిన సందర్భాలెన్నో. నాలుగైదు గంటలు ఫ్రెండ్సుతో సినిమా గురించే ముచ్చటిస్తా. ఇప్పుడు అదే క్యారెక్టర్‌ని వెండితెరపైనా మారుతి చూపిస్తున్నాడు.

==నాని మతిమరుపు గురించి అతడి సోదరి, భార్య కూడా గుర్తు చేస్తున్నారు. భలే భలే మగాడివోయ్‌ చిత్రంలో నాని రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌నే చేశాడు. అతడిని 'మల్టీ ప్లెక్స్‌' అని పిలుస్తానని నాని సోదరి చెప్పారు.