Begin typing your search above and press return to search.
జయసుధ సహజనటి, నాని సహజనటుడు
By: Tupaki Desk | 5 Sept 2015 12:52 AM ISTసహజనటి అన్నపిలుపు ఎంతో ఉన్నత మైనది. అదే బిరుదుగా పాపులర్ అయితే ఆ గుర్తింపు అసాధారణం. ఓ నటికి ఇలాంటి పిలుపు దక్కింది అంటే సినీపరిశ్రమలో గొప్ప గౌరవం దక్కినట్టేనని చెప్పాలి. టాలీవుడ్ లో జయసుధకి మాత్రమే ఈ గుర్తింపు ఉంది. మూడు దశాబ్ధాల కెరీర్‌లో సహజనటి అన్న బిరుదుకి ఏ డమరక అంటకుండా జయసుధ పెర్ఫామెన్స్ చేసి చూపించింది. అయితే ఇలాంటి ఓ బిరుదు హీరోకి ఇవ్వాలంటే ఎవరిని ఎంపిక చేసుకోవాలి? సరిగ్గా ఇదే ఐడియా మారుతికి వచ్చినట్టుంది.
ఇప్పుడున్న హీరోల్లో అంత సహజంగా తెరపై కనిపించే హీరో ఎవరై ఉంటారు? అని వెతికిన మారుతికి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టే నాని తగిలాడు. అందుకేనేమో ఈరోజు రిలీజైన భలే భలే మగాడివోయ్ సినిమా టైటిల్ కార్డ్స్ లో నేచురల్ హీరో నాని అని కార్డ్ వేశాడు. సూపర్ స్టార్ - పవర్ స్టార్ - మెగా స్టార్ - యంగ్ టైగర్ - మెగా పవర్ స్టార్ - స్టయిలిష్ స్టార్ - నటసింహా .. ఇలాంటి బిరుదుల సరసన ఈ బిరుదు కూడా చేరిపోయినట్టే. అయితే నాని ఇమేజ్‌కి తగ్గట్టే ఈ బిరుదుని మారుతి సెట్ చేశాడని అనిపించింది. అష్టా చెమ్మా నుంచి పక్కింటి అబ్బాయిగా మెప్పిస్తున్న నానీకి ఈ బిరుదు ఇవ్వడం తప్పేమీ కాదనిపిస్తోంది.
ఈరోజు రిలీజైన భలే భలే మగాడివోయ్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇదో చక్కని రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్. ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత నానికి అసలు సిసలు కమర్షియల్ హిట్ దక్కిందన్న టాక్ బైట వచ్చింది. అంతేకాదు ప్రతి ఫ్రేములోనూ నాని నటన ఎంతో సహజంగా ఆకట్టుకుందని క్రిటిక్స్ నుంచి ప్రశంసలొస్తున్నాయి. మారుతి నానీని చూపించిన తీరును ప్రశంసిస్తున్నారంతా.