Begin typing your search above and press return to search.

ఫ్లాప్‌ ను ముందే పసిగట్టి సీనియర్‌ అనిపించుకున్న నాని

By:  Tupaki Desk   |   10 March 2020 11:30 PM GMT
ఫ్లాప్‌ ను ముందే పసిగట్టి సీనియర్‌ అనిపించుకున్న నాని
X
సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఆరంభంలో అదృష్టంతో హిట్‌ పడితే వచ్చే క్రేజ్‌ ను స్టార్‌ డంను మాత్రం తెలివితో నిలుపుకోవాలి. ఎంతో మంది కెరీర్‌ ఆరంభంలో సక్సెస్‌ లు పడ్డా ఆ తర్వాత తర్వాత వారు కనిపించకుండా పోయారు. అందుకు ప్రధాన కారణం కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోక పోవడం. కథల జడ్జిమెంట్‌ సరిగా చేసుకోలేక ఫ్లాప్స్‌ చేసిన హీరోలు ఎంతో మంది కెరీర్‌ ను తక్కువ కాలానికే ముగించేసుకున్నారు.

హీరో నాని ఇటీవల ఒక సినిమాకు నో చెప్పాడట. కథ విషయంలో అనుమానం ఉండటంతో మార్పులు అవసరం అంటూ దర్శకుడికి చెప్పాడట. కాని ఆ దర్శకుడు కథలో మార్పు చేసేది లేదు అంటూ అదే కథను మరో యంగ్‌ హీరోకు చెప్పాడట. కథలో కాస్త హాట్‌.. రొమాన్స్‌ ఎక్కువ ఉండటం వల్లో లేక మరేంటో కాని ఆ కథ ఆ యంగ్‌ హీరోకు బాగా నచ్చి చేశాడు. ఆ సినిమా కోసం కాస్త ఎక్కువే కష్టపడ్డాట. కాని సినిమా మాత్రం తీవ్రంగా నిరాశ పర్చింది. వచ్చిన వారం రోజులకే అన్ని థియేటర్ల నుండి కనిపించకుండా వెళ్లింది.

ఆ కథను ముందే నాని సరిగ్గా జడ్జ్‌ చేసి ఇలాగే చేస్తే ఆడక పోవచ్చు అన్నాడట. కాని దర్శకుడు మాత్రం మొండి పట్టుదలకు పోయి పాపం ఆ యంగ్‌ హీరోను బలి చేశాడు. నాని సీనియర్‌ కాబట్టి కథల జడ్జ్‌ మెంట్‌ విషయంలో చాలా అడ్వాన్స్‌ గా ఉంటాడు. కాని ఆ హీరో కుర్రతనంతో ఒప్పుకుని ఫ్లాప్‌ ను మూట కట్టుకున్నాడు. ఇప్పటికే ఫ్లాప్స్‌ లో ఉన్న ఆ యంగ్‌ హీరోకు ఇది మరో ఫ్లాప్‌ అయ్యింది. కాస్త తెలివిగా ఆలోచించి నాని ఆ పెద్ద ఫ్లాప్‌ నుండి తప్పించుకున్నాడు అంటూ సోషల్‌ మీడియాలో జోకులు పేళుతున్నాయి.