Begin typing your search above and press return to search.

నాని మీద మహర్షి ఎఫెక్ట్ ?

By:  Tupaki Desk   |   25 Nov 2018 12:30 PM GMT
నాని మీద మహర్షి ఎఫెక్ట్ ?
X
అదేంటి న్యాచురల్ స్టార్ నాని మీద మహేష్ బాబు సినిమా ఎఫెక్ట్ పడటం ఏంటని ఆశ్చర్యపోకండి. ఇక్కడే ఉంది కిటుకు. ప్రిన్స్ నటిస్తున్న మహర్షి షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. రాగానే హైదరాబాద్ లో కోట్ల రూపాయల ఖర్చుతో వేసిన విలేజ్ సెట్ లో చాలా కీలకమైన భాగాన్ని షూట్ చేయబోతున్నారు. మహర్షిలో వచ్చే ఈ పల్లెటూరి నేపథ్యంలో సేంద్రీయ వ్యవసాయం గురించి ఆధునిక పద్ధతుల్లో ఎక్కువ దిగుబడులు పొలాల నుంచి ఎలా రాబట్టుకోవాలో చెప్పడం గురించి కథకు ఒక కీలకమైన లింక్ ఉంటుందట.

మహర్షిగా అమెరికాలో ఒక పెద్ద కంపెనీకి సిఈఓగా ఉన్న మహేష్ ఇంతదూరం ఓ గ్రామానికి ఎందుకు రావాల్సి వచ్చింది అనే దానికి కథలో బలమైన లింక్ ఉంటుందట. అదే సినిమాకు ప్రాణంగా నిలుస్తుందని టాక్. మరి దీనికి నానికి కనెక్షన్ ఏంటి అనే సందేహం రావొచ్చు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీలో నటిస్తున్న నాని దీని తర్వాత కిశోరుడు అనే కొత్త దర్శకుడికి ఓకే చెప్పినట్టు టాక్. కానీ ఆ కథలో పైన మహర్షి చెప్పిన థీమ్ ఉంటుందట. కథకు పోలిక లేకపోయినా సెంట్రల్ పాయింట్ అదే కాబట్టి రెండు ఒకేలా ఉన్నాయన్న అభిప్రాయం రావొచ్చు అనే ఆలోచనతో నాని వేరే కథతో రమ్మని చెప్పినట్టు ఫిలిం నగర్ టాక్.

మరి ఇది నిజమో కాదో కానీ కిశోరుడు మాత్రం ముందు అనుకున్న కథ కాకుండా వేరేది వండే పనిలో ఉన్నట్టు సమాచారం. ఇదీ ఒకందుకు మంచిదే. షూటింగ్ అంతా అయిపోయాక తెలియడం కన్నా స్క్రిప్ట్ దశలోనే గుర్తించి మేలుకోవడం బాగా హెల్ప్ అవుతుంది. మరి నాని జెర్సీ తర్వాత నాని వేరే కథతో కిశోరుడితో ప్రయాణం చేస్తాడో లేక ఇప్పటికే స్క్రిప్ట్ రెడీతో ఉన్న చంద్రశేఖర్ యేలేటితో సాగుతాడో వేచి చూడాలి