Begin typing your search above and press return to search.
నానిని రైతుగా చూడబోతున్నామా?
By: Tupaki Desk | 15 Oct 2018 3:10 PM GMTమూడేళ్ల పాటు అపజయమే లేకుండా దూసుకెళ్లిన నేచురల్ స్టార్ నానికి ఈ ఏడాది ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ వేసవిలో వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’ చాలా కాలం తర్వాత నానికి ఫ్లాప్ రుచిని చూపించింది. ఇటీవలే వచ్చిన ‘దేవదాస్’కు ఓపెనింగ్స్ బాగానే వచ్చినా అది కూడా తర్వాత నిలవలేకపోయింది. టాక్ పక్కన పెట్టి వసూళ్ల కోణంలో చూస్తే మాత్రం ఇది కూడా ఫ్లాప్ అన్నట్లే. దీంతో నాని కెరీర్లో వెనుకబడినట్లే కనిపిస్తున్నాడు. ఇప్పుడతడికి అర్జెంటుగా ఓ హిట్ అవసరం. నాని రొటీన్ బాటను విడిచిపెట్టి వైవిధ్యమైన కథలు.. పాత్రలకు ఓటేస్తే తప్ప అతడికి సక్సెస్ వచ్చేట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే నాని ఒక క్రికెటర్ పాత్ర చేయడానికి రెడీ అయ్యాడు. ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో అతను ‘జెర్సీ’ అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
దీని తర్వాత నాని మరో వైవిధ్యమైన సినిమా చేయబో్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అందులో అతను రైతు పాత్రలో కనిపించనున్నాడట. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పేరు సంపాదించిన కిశోరుడు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడట. నాని ఎక్కువగా సిటీ కుర్రాడి పాత్రలే చేశాడు. చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే పల్లెటూరి యువకుడి పాత్రలు చేశాడు. అందులో కూడా అతనేమీ రైతు పాత్రలు చేయలేదు. తొలిసారిగా అతను ఈ తరహా పాత్ర చేయబోతుండటం ఆసక్తి రేకెత్తించేదే. రైతుగా అతడి గెటప్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. ‘రంగస్థలం’ పెద్ద హిట్టయిన నేపథ్యంలో మన హీరోలు గ్రామీణ నేపథ్యంలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నానితో ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాను నిర్మించిన 14 రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.