Begin typing your search above and press return to search.

త్వరలో తండ్రి కాబోతున్న నాని

By:  Tupaki Desk   |   19 Nov 2016 4:55 AM GMT
త్వరలో తండ్రి కాబోతున్న నాని
X
ఇప్పుడు టాలీవుడ్ లో మరో హాట్ న్యూస్ హాల్ చల్ చేస్తోంది. ఆల్రెడీ పెళ్ళిళ్లయిన చాలామంది స్టార్ హీరోలు వరుసగా తండ్రులు కూడా అయిపోయారు. ఇప్పుడు మరో హీరో కూడా ఈ గ్యాంగ్ లో చేరనున్నాడు.

మరెవరో కాదండీ.. త్వరలోనే హీరో నాని తండ్రి కాబోతున్నాడని తెలుస్తోంది. 2012 అక్టోబర్ లో తన గాళ్ ఫ్రెండ్ అంజన ను పెళ్ళి చేసుకున్నాని నాని. వైజాగ్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇప్పుడు న్యూస్ ఏంటంటే.. నాని వైఫ్‌ అంజన ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. మరో రెండు నెలల్లో ఆవిడకు డెలివరీ డేట్ ఇచ్చారట డాక్టర్లు. సో నాని కూడా.. ఎన్టీఆర్.. బన్నీ.. నరేష్‌ తరహాలోనే త్వరలోనే డాడ్ స్టాటస్ కు ప్రమోట్ అయిపోతున్నాడనమాట. ప్రస్తుతానికి ఈ విషయాన్ని ఇంకా నాని రివీల్ చేయట్లేదు కాని.. అంజనతో పరిచయం ఉన్న వారందరికీ ఆల్రెడీ మ్యాటర్ తెలిసిపోయిందిలే.

సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నేను లోకల్ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న నాని.. ఆ తరువాత చేసే సినిమాను కొత్త డైరక్టర్ తో రూపొందిస్తున్నాడు. వరుసపెట్టి రిలీజ్ లు ప్లాన్ చేశాడంతే. నేను లోకల్ డిసెంబర్ 25న రిలీజ్ చేసే అవకాశం ఉంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/