Begin typing your search above and press return to search.

దాసరి పార్ట్-2 గా మారిపోయిన నాని

By:  Tupaki Desk   |   26 Sept 2016 3:22 PM IST
దాసరి పార్ట్-2 గా మారిపోయిన నాని
X
అసలు వెటరన్ దర్శకుడు దాసరి నారాయణరావు అంటే.. ఇప్పుడు ఆయన ఒక మెగా దర్శకుడు అనే విషయంకంటే కూడా ఆయన ఒక మెగా గెస్ట్ అనేదే పెద్ద విషయం. దాదాపు ప్రతీ ఈవెంటుకు ఆయన్ను చీఫ్‌ గెస్టుగా పిలువడం.. ఒకవేళ ఆయన ఏదైనా వివాదాస్పద్ కామెంట్లు చేయడం వంటివి చేస్తే హ్యాపీగా సినిమాలకు ఫ్రీ ప్రమోషన్ అయిపోవడం ఒక రొటీన ప్రక్రియగా మారింది. ఇప్పుడు మనం దాసరి పార్ట్ 2 గురించి చూద్దాం.

మామూలుగా మెగా హీరోల సినిమాలంటే ఖచ్చితంగా చీఫ్‌ గెస్టులు మెగాస్టార్ లేదా పవర్ స్టార్లే ఉంటారు. ఎప్పుడైనా రేర్ గా వేరే స్టార్ హీరోలు వస్తుంటారు. ఆ తరువాత అక్కినేనీస్, నందమూరీస్.. ఇలా ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ల ఫ్యామిలీ హీరోలే వారి గెస్టులు. ఇక తక్కిన వారందరూ దాసరిపైనే ఆధారపడుతుంటారు. అయితే ఇప్పుడు మాత్రం అందరూ అలా యంగ్ హీరో నాని మీద ఆధారపడేలా ఉన్నారు. ఎందుకంటే మనోడు ఎవరు పిలిచినా కూడా చక్కగా వచ్చేస్తున్నారు. బాబు బంగారం.. హైపర్.. ఇలా ఏ సినిమా ఆడియో లాంచులో చూసినా హీరో నానియే కనిపించేస్తున్నాడు.

ఆ విధంగా మనోడు దాసరి పార్ట్-2 గా మారిపోయాడనడంలో అతిశయోక్తి లేదు. అయితే నాని మంచితనం అనేది తన సినిమాలకు కూడా ఉపయోగపడుతుందండోయ్. ఒక సంవత్సరంలో ఏకంగా 3 సినిమాలు రిలీజ్ చేస్తున్నప్పుడు.. అస్తమానం అలా న్యూస్ లో ఉంటేనే బెటర్.