Begin typing your search above and press return to search.
మేజర్ టీజర్ పై అంచనాలు పెంచేసిన హీరో నాని..!
By: Tupaki Desk | 12 April 2021 5:30 AM GMTఈ మధ్యకాలంలో సినీఇండస్ట్రీలో అన్ని సినిమాలకు హైప్ టీజర్ నుండే క్రియేట్ అవుతోంది. అందులోను సెలబ్రిటీలతో టీజర్ లాంచ్ చేయిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ టీజర్ ఎక్కువమందికి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ అవెయిటింగ్ మూవీలలో ఒకటి మేజర్. అడవిశేష్ హీరోగా నటిస్తున్న ఈ బయోపిక్ మూవీ పై ఫస్ట్ నుండి ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. జులై 2న విడుదల కాబోతున్న ఈ బయోపిక్ మూవీ.. 26/11 ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రికరణ చివరిదశకు చేరుకోవడంతో ఏప్రిల్ 12న అంటే ఈరోజు సాయంత్రం 4గంటలకు మేజర్ టీజర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.
అయితే టీజర్ విడుదలకు ఇంకా కొద్దీ గంటల సమయం మాత్రమే ఉండటంతో ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. అసలే మేజర్ టీజర్ పాన్ ఇండియా మూవీ మూవీ కావడంతో తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అయితే మూడు భాషల్లో ముగ్గురు సూపర్ స్టార్స్ మేజర్ టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా టీజర్ తెలుగులో సూపర్ స్టార్ మహేష్, హిందీ టీజర్ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, మలయాళం టీజర్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ రిలీజ్ చేయనున్నారు. ఈ ముగ్గురు టీజర్ రిలీజ్ చేస్తున్నారని తెలిసే ఫ్యాన్స్ ఖుషీగా ఫీలవుతుండగా.. టాలీవుడ్ హీరో నాని చేసిన ట్వీట్ సినిమా పై మరింత ఆసక్తిపెంచింది. హీరో నాని ట్విట్టర్ వేదికగా.. 'నేను ఆల్రెడీ మేజర్ టీజర్ చూసాను. ఈ మధ్యకాలంలో నేను చూసిన బెస్ట్ టీజర్ ఇదే' అంటూ ట్వీట్ చేసాడు. నాని అలా చెప్పడంతో సినిమాపై అంచనా పెరిగిపోయాయి. చూడాలి మరి మేజర్ టీజర్ ఎలా ఉండబోతుందో..!